ఎన్టీపీసీలో ముగిసిన ఆర్‌ఈడీ సంజయ్‌ పర్యటన

ABN , First Publish Date - 2021-07-12T06:15:34+05:30 IST

ఎన్టీపీసీ రీజినల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌(సౌత్‌) సంజయ్‌ మదన్‌ రెండో రోజు ఆదివారం విస్తతంగా పర్యటించా రు.

ఎన్టీపీసీలో ముగిసిన ఆర్‌ఈడీ సంజయ్‌ పర్యటన
టీఎస్‌టీపీపీలో డీఎం స్ట్రీంను ప్రారంభిస్తున్న ఆర్‌ఈడీ

- రెండో రోజు టీఎస్‌టీపీపీ, సోలార్‌ ప్లాంట్‌ నిర్మాణ పనుల పరిశీలన

జ్యోతినగర్‌, జూలై 11 : ఎన్టీపీసీ రీజినల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌(సౌత్‌) సంజయ్‌ మదన్‌ రెండో రోజు ఆదివారం విస్తతంగా పర్యటించా రు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న తెలంగా ణ సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు(టీఎస్‌టీపీ పీ)లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రాజె క్టు పురోగతిని అధికారులను అడిగి తెలుసుకు న్నారు. ఈ సందర్భంగా టీఎస్‌టీపీపీలో నూ తనంగా నిర్మించిన డీ వినరలైజ్డ్‌ స్ట్రీంను ఆర్‌ ఈడీ సంజయ్‌ ప్రారంభించారు. నిర్మాణ పను ల్లో నాణ్యత విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దని ఆర్‌ఈడీ సూచించారు. అనంత రం ఆయన ఎన్టీపీసీ రిజర్వాయర్‌లో నిర్మిస్తు న్న 100మెగావాట్ల ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్టు ను సంర్శించారు. నిర్మాణ పనుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. చివరిగా 2600 మెగా వాట్ల రామగుండం ప్రాజెక్టులోని వివిధ విభా గాలను పరిశీలించారు. 4 దశాబ్ధాలుగా నాణ్య మైన విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్న రామగుం డం ఎన్టీపీసీ దేశీయ విద్యుత్‌ రంగంలో అగ్ర స్థానంలో నిలుస్తుందని సంజయ్‌ అన్నారు. ఎన్టీపీసీకి చెందిన ఉద్యోగులు, అధికారుల సంఘాల ప్రతినిధులతో ఆర్‌ఈడీ సమావేశ మయ్యారు. అలాగే ఎన్టీపీసీ ఆధ్వర్యంలో నెల కొల్పిన మియావాకి ప్లాంటేషన్‌ను ఆర్‌ఈడీ పరిశీలించారు. పర్యావరణ పరిరక్షణలో భా గంగా మియావాకి విధానాన్ని విస్తృతంగా అమలు చేయాలని ఆర్‌ఈడ సూచించారు. ఆర్‌ఈడీ వెంట రామగుండం ప్రాజెక్టు సీజీ ఎం సునిల్‌ కువర్‌, ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.  రెండు రోజుల తన పర్యటనను ముగించుకొని రాత్రి ఇక్కడి నుంచి హైదరా బాద్‌కు ఆర్‌ఈడీ తరలివెళ్లారు. 

Updated Date - 2021-07-12T06:15:34+05:30 IST