అటవీ భూముల పట్టాలకు దరఖాస్తుల స్వీకరణ

ABN , First Publish Date - 2021-11-09T05:38:10+05:30 IST

గత కొన్నేళ్లుగా అటవీ భూములు సాగు చేసుకుంటున్న రైతుల నుంచి దరఖాస్తులు స్వీరిస్తున్నట్టు డీఆర్‌డీఓ శ్రీధర్‌ పేర్కొన్నారు.

అటవీ భూముల పట్టాలకు దరఖాస్తుల స్వీకరణ
సమావేశంలో మాట్లాడుతున్న డీఆర్‌డీఓ శ్రీధర్‌

అంతర్గాం, నవంబరు 8: గత కొన్నేళ్లుగా అటవీ భూములు సాగు చేసుకుంటున్న రైతుల నుంచి దరఖాస్తులు స్వీరిస్తున్నట్టు డీఆర్‌డీఓ శ్రీధర్‌ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ చట్టంలో భాగంగా ఈనెల 8 నుంచి 10 వరకు మండలంలోని వివిధ గ్రామాల్లో 2005, 13 డిసెంబర్‌కంటే ముందు నుంచి సాగుచేస్తున్న ఎస్‌టీలు, మూడు తరాలుగా సాగుచేస్తున్న ఎస్‌సీ, బీసీ రైతులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ మేరకు సోమవారం మండలంలోని ఆకెనపల్లి, ఎగ్లాస్‌పూర్‌ గ్రామాల్లో సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శి, అటవీశాఖ బీట్‌ అధికారి, వీఆర్‌ఏలతో కమిటీలు వేసి గ్రామ సభల్లో రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్‌ పీ సంపత్‌, బీ యాదగిరి, ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి దేవరాజు, ఎంపీఓ సమ్మిరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు గంగాధరి దేవమ్మరామన్న, మేరుగు పోచం, పంచాయతీ కార్యదర్శులు, రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-09T05:38:10+05:30 IST