మెట్‌పల్లిలో గంగపుత్రుల రాస్తారోకో
ABN , First Publish Date - 2021-01-21T05:01:30+05:30 IST
రాష్ట్ర మంత్రి తలసాని యాదవ్ ఇ టీవల కోకాపేటలో చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ మెట్‌పల్లిలో గంగపుత్రులు బుధవారం రాస్తారోకో నిర్వహించారు.

ఇబ్రహీంపట్నం, జనవరి 20(మెట్‌పల్లి) : రాష్ట్ర మంత్రి తలసాని యాదవ్ ఇ టీవల కోకాపేటలో చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ మెట్‌పల్లిలో గంగపుత్రులు బుధవారం రాస్తారోకో నిర్వహించారు. గంగపుత్రుల ఆందోళన సందర్భంగా పో లీసులు భారీ బందోబస్తు జరిపారు. జిల్లాలోని పలు గ్రామాల నుంచి తరలివ చ్చిన పలువురు గంగపుత్రులు ఫ్లకార్డులు, బ్యానర్లను ప్రదర్శిస్తూ స్థానిక వ్యవ సాయ మార్కెట్ చౌరస్తా నుంచి ర్యాలీ ప్రారంభించారు. అనంతరం శాస్త్రీచౌర స్తా వద్ద బైఠాయించి సుమారు రెండు గంటల పాటు రాస్తారోకో నిర్వహించా రు. ఆందోళనతో ట్రాఫిక్ అంతరాయం కలగడంలో పోలీసులు జోక్యం చేసుకు ని ఆందోళనను విరమింపజేశారు. అనంతరం ఆర్‌డీఓ వినోద్ కుమార్‌కు విన తిపత్రం సమర్పించారు. మెట్‌పల్లిలో జరగనున్న ఆందోళన సందర్బంగా పోలీ సులు సుమారు పది మంది గంగపుత్రులను ముందస్తుగా అరెస్టు చేసి వ్యక్తిగ త పూచికత్తుపై విడిచిపెట్టారు. డీఎస్పీ గౌస్‌బాబా నేతృత్వంలో పోలీసులు బం దోస్తు నిర్వహించారు.