బాధ్యతతో మెలగండి.. లేదంటే కేసులు తప్పవు: ఏసీపీ ఉమేందర్
ABN , First Publish Date - 2021-05-21T21:42:59+05:30 IST
లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులపై రామగుండం పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలను బేఖాతరు చేస్తూ బయట తిరుగుతున్న

రామగుండం: లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులపై రామగుండం పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలను బేఖాతరు చేస్తూ బయట తిరుగుతున్న 30 వాహనాలను శుక్రవారం సీజ్ చేశారు. అనంతరం వారికి గోదావరిఖని ఏసీపీ ఉమేందర్ కౌన్సిలింగ్ ఇచ్చారు. అత్యవసరమైతేనే తప్ప ప్రజలెవరూ బయటకు రావద్దన్నారు.
ప్రతిరోజు లాక్ డౌన్ సమయంలో పోలీసులు వాహనాలు సీజ్ చేస్తున్నా కూడా కొంత మంది అనవసరంగా ఎలాంటి కారణాలు లేకుండా బయటకు వస్తున్నారని ఏసీపీ వాపోయారు. కరోనా రెండో దశ తీవ్రత అధికమవడంతో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని, అయినా కొందరు బాధ్యతారాహిత్యంతో ఉంటున్నారన్నారు. వెసులుబాటు కల్పించిన సమయాల్లోనే అవసరమైన పనులు చెసుకోవాలని నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేస్తామని ఏసీపీ హెచ్చరించారు. ఈ అవగాహన కార్యక్రమంలో రామగుండం సర్కిల్ ఇన్ స్పెక్టర్ కణతల లక్ష్మీనారాయణ, ఎస్ఐ స్వరూప్ రాజ్, పీఎస్ఐ రాజశేఖర్ సిబ్బంది పాల్గొన్నారు.

