‘స్వచ్ఛ’ ర్యాంకులను ప్రకటించిన రామగుండం కార్పొరేషన్‌

ABN , First Publish Date - 2021-02-23T05:48:46+05:30 IST

రామగుండం కార్పొరేషన్‌లో స్వచ్ఛ సర్వేక్షణ్‌-2021లో భాగంగా వివిధ సంస్థలకు స్వచ్ఛ ర్యాంకులు ప్రకటిస్తూ రామగుండం కార్పొరేషన్‌ కమిషనర్‌ ఉదయ్‌కుమార్‌ సోమవారం కార్పొరేషన్‌ కార్యాలయంలో నిర్వాహకులకు షీల్డ్‌, ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.

‘స్వచ్ఛ’ ర్యాంకులను ప్రకటించిన రామగుండం కార్పొరేషన్‌
అవార్డు అందజేస్తున్న మున్సిపల్‌ కమిషనర్‌

-షీల్డ్‌లను అందించిన మున్సిపల్‌ కమిషనర్‌

కోల్‌సిటీ, ఫిబ్రవరి 22: రామగుండం కార్పొరేషన్‌లో స్వచ్ఛ సర్వేక్షణ్‌-2021లో భాగంగా వివిధ సంస్థలకు స్వచ్ఛ ర్యాంకులు ప్రకటిస్తూ రామగుండం కార్పొరేషన్‌ కమిషనర్‌ ఉదయ్‌కుమార్‌ సోమవారం కార్పొరేషన్‌ కార్యాలయంలో నిర్వాహకులకు షీల్డ్‌, ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. హోటల్‌ క్యాటగిరిలో జేజే ఫ్యామిలీ రెస్టారెంట్‌, పాఠశాల క్యాటగిరిలో ఎన్‌టీపీసీ జిల్లా పరిషత్‌ హా స్కూల్‌, ఆసుపత్రుల్లో గోదావరిఖని ప్రభుత్వ, సింగరేణి ఏరియా ఆసుపత్రి, మార్కెట్‌ అసోసిషన్‌లో శివాజీనగర్‌ మార్కెట్‌ స్వచ్ఛత ర్యాంకింగ్‌లో ప్రథమ స్థానంలో ఉండగా, బెస్ట్‌ ఇన్నోవేషన్‌ క్యాటగిరి శివదీప మట్కిచాయ్‌ ప్రథమ స్థానాన్ని సాధించినట్టు తెలిపారు. 


Updated Date - 2021-02-23T05:48:46+05:30 IST