రాజన్న ఆలయ హుండీ లెక్కింపు
ABN , First Publish Date - 2021-10-21T06:25:04+05:30 IST
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి హుండీ ఆదాయాన్ని బుధవారం ఆలయం ఓపెన్స్లాబ్లో లెక్కించారు.

వేములవాడ టౌన్, అక్టోబరు 20 : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి హుండీ ఆదాయాన్ని బుధవారం ఆలయం ఓపెన్స్లాబ్లో లెక్కించారు. ఆలయ 15 రోజల హుండీ ఆదాయం కోటి 71 లక్షల 92 వేల 570 రూపాయలు, 626 గ్రాముల 450 మిల్లీగ్రాముల బంగారం, 17 కిలోల 500 గ్రాముల వెండి సమకూరినట్లు ఆలయాధికారులు వెల్లడించారు. ఆలయ ఈవో కృష్ణప్రసాద్ హుండీ లెక్కింపును పర్యవేక్షించారు.