కోటిలింగాలలో కొండచిలువ కలకలం

ABN , First Publish Date - 2022-01-01T04:58:39+05:30 IST

జగిత్యాల జిల్లా వెల్గటూర్‌ మండలంలోని కోటిలింగాల గోదావరిలో శుక్రవారం కొండ చిలువ కలకలం సృష్టించింది.

కోటిలింగాలలో కొండచిలువ కలకలం
కోటిలింగాలలో కొండ చిలువను పడుతున్న అటవీ శాఖ సిబ్బంది

 కొండచిలువను పట్టుకున్న అటవీ అధికారులు

వెల్గటూర్‌, డిసెంబరు 31: జగిత్యాల జిల్లా వెల్గటూర్‌ మండలంలోని కోటిలింగాల గోదావరిలో శుక్రవారం కొండ చిలువ  కలకలం సృష్టించింది. గోదావరి ఒడ్డుకు నిలిపి ఉన్న బోట్‌ వద్ద సంచరించడాన్ని భక్తులు గమనించి భ యాందోళనకు గురయ్యారు. విషయం ఈవో మారు తీరా వు, ఆలయ చైర్మన్‌ నారాయణరావుకు తెలుపడంతో  వా రు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై నరేష్‌ కోటి లింగాలకు చేరుకొని గోదావరిలో కొండ చిలువ సంచరించ డాన్ని నిర్ధారించుకొని అటవీశాఖ అధికారులకు సమాచా రం అందించారు. స్పందించిన అటవీ శాఖ అధికారులు గోదావరిలో ఉన్న కొండ చిలువను పట్టుకొని సంచిలో వేసి స్వాధీనం చేసుకున్నారు. కొండ చిలువ సుమారు 45 కిలో లు ఉంటుందని అఽఽధికారులు తెలిపారు. 

Updated Date - 2022-01-01T04:58:39+05:30 IST