రైతులకు అందుబాటులో కొనుగోలు కేంద్రాలు

ABN , First Publish Date - 2021-11-06T05:24:08+05:30 IST

రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం అమ్ముకునేలా వారికి అందుబాటులో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తు న్నామని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అ న్నారు.

రైతులకు అందుబాటులో కొనుగోలు కేంద్రాలు
అప్పన్నపేటలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి

- పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి

పెద్దపల్లి రూరల్‌, నవంబరు 5 : రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం అమ్ముకునేలా వారికి అందుబాటులో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తు న్నామని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అ న్నారు. శుక్రవారం మండలంలోని అప్పన్నపేటలో పీఏ సీఎస్‌ ఏర్పాటుచేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రాం మ్మూర్తి, సింగిల్‌విండో చైర్మన్‌ దాసరి చంద్రారెడ్డి, వైస్‌ చైర్మన్‌ చింతపండు సంపత్‌, సర్పంచ్‌ చీకటి స్వరూప పోచాలు, ఉపసర్పంచ్‌ శ్రీనివాస్‌, ఎంపీటీసీ తోట నర్స మ్మ, డైరెక్టర్లు తిరుపతి, శారద, టీఆర్‌ఎస్‌ గ్రామ అధ్య క్షుడు విజయరావులతో పాటు రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-06T05:24:08+05:30 IST