టీబీజీకేఎస్‌ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన

ABN , First Publish Date - 2021-10-29T05:57:00+05:30 IST

సింగరేణిలో నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గురువారం గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్‌ ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు.

టీబీజీకేఎస్‌ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన
జీడీకే 1ఇంక్లైన్‌పై మాట్లాడుతున్న టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు వెంకట్రావ్‌

-బొగ్గు బ్లాకుల వేలాన్ని విరమించకపోతే నిరవధిక సమ్మె : అధ్యక్షుడు వెంకట్రావ్‌

గోదావరిఖని, అక్టోబరు 28: సింగరేణిలో నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గురువారం గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్‌ ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఆర్‌జీ-1 పరిధిలోని జీడీకే 1ఇంక్లైన్‌పై యూనియన్‌ ఉపాధ్యక్షుడు గండ్ర దామోదర్‌రావు ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు వెంకట్రావ్‌ హాజరై మాట్లాడారు. బొగ్గుగనుల వేలం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, కొత్త గూడెం, మంచిర్యాల జిల్లాల్లోని నాలుగు బ్లాకులను ప్రైవేట్‌ పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను కార్మికులంతా ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సింగరేణిలో బొగ్గు గనులను వేలంపాట వేస్తే ఊరుకోబోమని, సకల జనుల సమ్మెలో కార్మికులు పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నారని, కేంద్ర ప్రభుత్వం నాలుగు బ్లాకులను వేలం వేయడాన్ని ఖండిస్తున్నట్టు, అవసరమైతే వేలం పాటను అడ్డుకోవడానికి నిరవధిక సమ్మెకు దిగుతామని వెంకట్రావ్‌ హెచ్చరించారు. బొగ్గు బ్లాకుల వేలానికి వ్యతిరేకంగా సింగరేణిలో ఉన్న సంఘాలు కూడా కలిసి రావాలని పిలుపునిచ్చారు. కార్మికులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజ రై ఆయా గనులు, డిపార్ట్‌మెంట్ల అధికారులకు వినతిపత్రం అందజేశా రు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్‌రెడ్డి, దేవ వెంకటేశం, కనకం శ్యామ్‌సన్‌, యెట్టం కృష్ణ, పుట్ట రమేష్‌, వడ్డేపల్లి శంకర్‌, గంగాధర్‌, శేషగి రి, వెంకటేష్‌, అల్లం ఐలయ్య, షబ్బీర్‌ అహ్మద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-29T05:57:00+05:30 IST