విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో నిరసన

ABN , First Publish Date - 2021-10-21T06:14:47+05:30 IST

బంగ్లాదేశ్‌లో హిందువులపై, హిందూ దేవాలయాలపై దాడులను నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో బుధవారం నిరసన తెలిపారు.

విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో నిరసన
దిష్టిబొమ్మను దహనం చేస్తున్న వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌ నాయకులు

- బంగ్లాదేశ్‌ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

మార్కండేయకాలనీ, అక్టోబరు 20: బంగ్లాదేశ్‌లో హిందువులపై, హిందూ దేవాలయాలపై దాడులను నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో బుధవారం నిరసన తెలిపారు. ప్రధాన చౌరస్తాలో వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌ నాయకులు, కార్యకర్తలు బంగ్లాదేశ్‌ జిహాది ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం వీహెచ్‌పీ జిల్లా కార్యదర్శి అయోధ్య రవీందర్‌ మాట్లాడుతూ బంగ్లాదేశ్‌లోని హిందువులపై జీహాదీల దాడులు నిరంతరం పెరుగుతున్నాయని, హిందూ పుణ్యక్షేత్రాలు, ఆరాధన మండపాలను నాశనం చేస్తూ హిందువులపై నిరంతరం దాడులు చేస్తున్నారన్నారు. దసరా దుర్గాదేవి సందర్భంగా బంగ్లాశ్‌లోని 22కుపైగా జిల్లాలో ఒకే సారి హిందువులపై మతోన్మాదులు, జీహాదీలు దాడికి పాల్పడ్డారని, బంగ్లాదేశ్‌లో 150పైకిగా దుర్గాదేవి మండపాలు, హిందువుల ఇస్కాన్‌ దేవాలయాలకు నిప్పుపెట్టారని, దేవతల విగ్రహాలు ధ్వంసం చేశార న్నారు. హిందువులపై దాడులకు పాల్పడుతూ తల్లులు, సోదరీమణులను తీవ్ర అవమానానికి గురి చేశా రన్నారు. ఇంత జరిగినా కూడా ఆ దేశ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని, ఈ భయంకరమైన సంఘటనలు చూస్తుంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల్లో ఆగ్రహం పెరుగుతున్నదన్నారు. హిందువులపై దాడులు, దౌర్జన్యాన్ని అరికట్టడానికి, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మరోసారి దాడులకు పాల్పడకుండా బంగ్లాదేశ్‌ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, భారత ప్రభుత్వం వెంటనే సీఏఏ, ఎన్‌ఆర్‌సీ అమలు చేసి హిం దువులకు న్యాయం చేయాలన్నారు. విశ్వహిందూ పరిషత్‌, బజరంగ్‌దళ్‌ నాయకులు తానాజీజాదవ్‌, అడిగొప్పుల రాజు, బండ సమ్మన్న, సంపత్‌యాదవ్‌, ము లుకుంట్ల శ్రీనివాస్‌, కొండపర్తి లింగన్న, దువ్వాసి తిరుపతి, కాస సత్యనారాయణ, మునిగాల సంపత్‌, చక్రపాణి, శివకుమార్‌, పవన్‌, శ్రీనివాస్‌, అనిల్‌, రాం మోహన్‌, రాజేష్‌, నరేష్‌, మృణాల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-21T06:14:47+05:30 IST