కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిరసన

ABN , First Publish Date - 2021-11-23T06:15:44+05:30 IST

ధాన్యం కొనుగో ళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ సోమవారం నాంసానిపల్లిలో కాంగ్రెస్‌ నాయకులు అర్ధ నగ్నంగా నిరసన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిరసన
నాంసానిపల్లిలో నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులు

ఓదెల, నవంబరు 22 : ధాన్యం కొనుగో ళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ సోమవారం నాంసానిపల్లిలో కాంగ్రెస్‌ నాయకులు అర్ధ నగ్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు గోసిక రాజేశం మాట్లాడుతూ నాంసానిపల్లి, ఓదె ల, అబ్బిడిపల్లిలో 40 రోజులు దాటినా కూడా ధాన్యం తూకం వేయలేదని, దీంతో నిర్వాహకులు జాప్యంవల్ల ధాన్యం మొలకె త్తున్నాయని తెలిపారు. అధికారుల పర్యవే క్షణ లేకపోవడం వల్ల ధాన్యం కోనుగోలు కేంద్రాల్లో కేంద్రాల నిర్వాహకులు ఇష్టారా జ్యంగా వ్యవహరిస్తున్నారని, దీంతో మరిం త జాప్యం అయ్యి రైతులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారని తెలిపారు. రోడ్డుపై అర్ధ నగ్నంగా నిరసన వ్యక్తం చేస్తూ ధాన్యం కొ నుగోలు వేగవంతం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నోముల మా ధవరెడ్డి, రాచెర్ల నవీన్‌, ఆకునూరి కుమార్‌, రాచెర్ల రాకేష్‌, గోసిక సాయి, మర్రిపల్లి వి నయ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-23T06:15:44+05:30 IST