పోరాటాలతోనే సమస్యల పరిష్కారం
ABN , First Publish Date - 2021-03-21T06:10:10+05:30 IST
పోరాటాల ద్వారానే సమస్యల పరిష్కారం సాధ్యం అవుతుందని ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు సదానంద గౌడ్ పిలుపునిచ్చారు.

ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానంద గౌడ్
జగిత్యాల అర్బన్, మార్చి 20: పోరాటాల ద్వారానే సమస్యల పరిష్కారం సాధ్యం అవుతుందని ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు సదానంద గౌడ్ పిలుపునిచ్చారు. శనివారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ కార్యాలయంలో జిల్లా కౌన్సిల్ సమావేశం జిల్లా అధ్యక్షుడు భైరం హరికిరణ్ అధ్యక్షతన నిర్వహిం చారు. కార్యక్రమంలో సదానందగౌడ్ మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగు ణంగా శాస్ర్తీయంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు 43శాతం ఫిట్‌మెంట్ తో పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఆమోదయోగ్యంగా 01 జూలై 2018 నుంచి 33 నెలలుగా ఎదరుచూస్తున్న పీఆర్సీని పూర్తిగా నగదు రూపంలో చెల్లించాలని కోరారు. విద్యాశాఖలో పదోన్నతుల ప్రక్రియ ప్రారం భించ కుండానే అన్ని శాఖల్లో పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేశామని సీఎం ప్రకటించడం శోచనీయం అన్నారు. పదోన్నతుల షెడ్యూల్ ప్రకటించి పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సబ్జెక్ట్ ఉపాధ్యాయుల కొరత తీర్చాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ప్రత్యేక ఆరోగ్య ట్రస్ట్ ద్వారా ఆరోగ్య కార్డులు జారీ చేసి మెరుగైన చికిత్స అందజేయా లన్నారు. డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు సీపీఎస్ పథకం నుంచి మినహాయిం చాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మచ్చ శంకర్, రాష్ట్ర బాధ్యులు రాజోజి భూమయ్య, నంబి రాజేంధర్ శర్మ, బొల్లె చిన్నయ్య జిల్లా కౌన్సిలర్లు, మండల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.