సమస్యల పరిష్కారానికి ప్రగతిభవన్‌ ముట్టడికైనా సిద్ధమే

ABN , First Publish Date - 2021-12-26T05:21:24+05:30 IST

తమ డిమాండ్ల సాధన కోసం మ ధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారానికి అవరమైతే ప్రగతి భ వన్‌ ముట్టడికైనా బీజేపీ సిద్ధంగా ఉంటుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ రావు పేర్కొన్నారు.

సమస్యల పరిష్కారానికి ప్రగతిభవన్‌ ముట్టడికైనా సిద్ధమే
సంఘీభావం తెలిపిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు

బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ రావు 

జగిత్యాల అర్బన్‌, డిసెంబరు 25: తమ డిమాండ్ల సాధన కోసం మ ధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారానికి అవరమైతే ప్రగతి భ వన్‌ ముట్టడికైనా బీజేపీ సిద్ధంగా ఉంటుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ రావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని స్థానిక ఆర్డీవో కా ర్యాలయం ఎదుట ప్రభుత్వ పాఠశాలల వంట కార్మికులు చేస్తున్న రిలే దీక్ష శనివారానికి 6వ రోజుకు చేరుకుంది. కార్మికుల దీక్షకు జిల్లా అధ్యక్షు డు సత్యనారాయణరావు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ కార్మికుల డిమాండ్లు న్యాయసమ్మతమైనవేనన్నారు. నె లకు కార్మిక చట్టాన్ని అనుసరించి రూ. 10,500లు చెల్లించాలని డిమాం డ్‌ చేశారు. మధ్నాహ్న భోజన కార్మికుల సమస్యలను నిజామాబాద్‌ ఎం పీ అర్వింద్‌, కరీంనగర్‌ ఎంపీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ దృ ష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని  కార్మి కులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాగిల్ల స త్యనారాయణ, అనిల్‌, గంగాధర్‌, భూమి రమణ, దివాకర్‌, రాజన్న, జగదీ ష్‌, లక్ష్మీనారాయణ, నక్క జీవన్‌, రమేష్‌తో పాటు వంట కార్మికులు గంగా ధర్‌, భాగ్యలక్ష్మీ తదితరులున్నారు.

Updated Date - 2021-12-26T05:21:24+05:30 IST