జగిత్యాలకు చేరిన రాజకీయ సంకల్ప సైకిల్‌ యాత్ర

ABN , First Publish Date - 2021-10-29T06:06:02+05:30 IST

స్వేరోస్‌ స్టూడెంట్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో తలపెట్టిన రాజకీయ సంకల్ప సైకిల్‌ యాత్ర జగిత్యాల జిల్లాకు చేరింది.

జగిత్యాలకు చేరిన రాజకీయ సంకల్ప సైకిల్‌ యాత్ర
జగిత్యాలకు చేరిన సంకల్ప సైకిల్‌ యాత్ర

జగిత్యాల అర్బన్‌, అక్టోబరు 28: స్వేరోస్‌ స్టూడెంట్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో తలపెట్టిన రాజకీయ సంకల్ప సైకిల్‌ యాత్ర జగిత్యాల జిల్లాకు చేరింది. ఈ సైకిల్‌ యాత్రకు స్థానిక బీఎస్పీ నాయకులు ఘనస్వాగతం పలికారు. పట్టణం లోని స్థానిక తహశీల్‌ చౌరస్తా వద్ద రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్‌ అంబే డ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్వే రోస్‌ స్టూడెంట్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్‌ మాట్లాడుతూ అక్టోబర్‌ 9న హైదరాబాద్‌ గన్‌పార్క్‌ అమరవీరుల స్తూపం వద్ద ప్రారంభమైన సైకిల్‌ యాత్ర, ఇరవై రోజులుగా 930 కి.మీ పూర్తిచేసుకుని గురువారం జగిత్యాల జిల్లా కేంద్రానికి చేరిందన్నారు. విద్య,వైద్యం, ఉపాధి అందించాలనే నినాదం తోనే సైకిల్‌ యాత్ర చేపట్టినట్టు శ్రీకాంత్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు శంకర్‌, లింబాద్రి, సంపత్‌, నక్క విజయ్‌, ఎస్‌ఎస్‌యూ నాయకు లు ఉమేష్‌, రాకేష్‌, రాజు, హరికృష్ణ, తిరుపతి, విజయ్‌ తదితరులున్నారు. 

గొల్లపల్లికి చేరిన సైకిల్‌ యాత్ర

గొల్లపల్లి : స్వేరో స్టూడెంట్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్‌ చేపట్టిన  సైకిల్‌ యాత్ర గురువారం గొల్లపల్లి మండల కేంద్రానికి చేరింది. మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్‌ విగ్రహం వద్ద బీఎస్పీ, ఎమ్మార్పీఎస్‌, దళిత సంఘాల నాయకులు సైకిల్‌యాత్రికులకు ఘన స్వాగతం పలికారు. ఈ సంద ర్భంగా అంబేద్కర్‌ విగ్రహానికి  పూలమాలలు వేసి ఘన నివాళులర్పించా రు. అనంతరం జగిత్యాల-ధర్మారం ప్రధాన రహదారిపై మండల కేంద్రం నుంచి శ్రీరాముల పల్లె మీదుగా సైకిల్‌ యాత్ర జగిత్యాల జిల్లా కేంద్రంలోకి ప్రవే శించింది. ఈ కార్యక్రమంలో కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడు రాకేష్‌, బీఎస్పీ ధర్మపురి నియోజకవర్గ ఇన్‌చార్జి నాగరాజు, నాయకులు దిలీప్‌, రమేష్‌  పాల్గొన్నారు.

Updated Date - 2021-10-29T06:06:02+05:30 IST