స్పందించే హృదయం ఉంటేనే కవిత్వం

ABN , First Publish Date - 2021-03-22T05:26:14+05:30 IST

స్పందించే హృదయం ఉంటేనే కవిత్వం అద్భుతంగా వస్తుందని జిల్లా అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌ అన్నారు.

స్పందించే హృదయం ఉంటేనే కవిత్వం
కవయిత్రి వినీలకు పురస్కారం ప్రదానం చేస్తున్న అడిషనల్‌ కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌

- అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌

కరీంనగర్‌ కల్చరల్‌, మార్చి 21: స్పందించే హృదయం ఉంటేనే కవిత్వం అద్భుతంగా వస్తుందని జిల్లా అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌ అన్నారు. ఆదివారం నగరంలోని ఫిలింభవన్‌లో ‘సంటి అనిల్‌కుమార్‌ లిటరరీ సంస్థ, లాంతరు సాహితీ సాంస్కృతిక సంస్థ’ ఆధ్వ ర్యంలో తెలుగు వెలుగు కవితా సంకలనం ఆవిష్కరణ, ప్రపంచ కవిత్వ దినోత్సవం, లాంతరు పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా అడిషనల్‌ కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌ హాజరై తెలుగు వెలుగు కవితా సంకలన్నా ఆవిష్కరించి పుర స్కారాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో కవయిత్రి వినీలకు పురస్కారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురస్కారాలు రచయితలకు కొత్త ఉత్సాహాన్ని అందిస్తాయని, బాధ్యతను కూడా పెంచు తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సంటి అనిల్‌ కుమార్‌ సోషల్‌, లిటరరీ ఆర్గనైజేషన్‌ అధ్యక్షుడు సంటి అనిల్‌కుమార్‌, లాంతర్‌ సాహితీ సాంస్కృతిక సేవా సంస్థ అధ్యక్షురాలు సంటి రూప, కవులు, రచయితలు మాడిశెట్టి గోపాల్‌ కాచిడి గోపాల్‌రెడ్డి దార స్నేహిలత, వెగ్గలం ఉషశ్రీ, కట్ల భాగ్యలక్ష్మీ, మద్దివేని జ్యోతి, ఛత్రపతి పాల్గొన్నారు. 

- మరో కార్యక్రమంలో...

కరీంనగర్‌ కల్చరల్‌, మార్చి 21: ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా ఉదయసాహితి ఆధ్వర్యంలో వైరాగ్యం ప్రభాకర్‌ ఆధ్యక్షతన ఆదివారం ఉభయ తెలుగు రాష్ట్రాల కవులతో గూగుల్‌మీట్‌ ద్వారా కవిసమ్మేళనం నిర్వహించారు.రచయిత, విమర్శకుడు దాస్యం సేనాధిపతి, ఎస్సారార్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కలువకుంట రామకృష్ణ మాట్లాడుతూ కవులు సమాజహితం చేకూర్చే రచనలు చేయాలని అన్నారు. సహృదయత గలవారే కవిత్వం రాస్తారని ఎదుటివారి కవిత్వాన్ని ఆస్వాదిస్తారని అన్నారు. సుమారు 50మంది కవులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

‘మానవత్వ పరిమళాలు పంచేది కవిత్వం’

జాతులమధ్య నెలకొన్న వైషమ్యాలను, వైరుధ్యా లను రూపుమాపుతూ విశ్వమంతటా మానవత్వ పరిమళాలను పంచేదే కవిత్వమని కవి అన్నవరం దేవేందర్‌ అన్నారు. ఫిలింభవన్‌లో ఆదివారం సాహితీ సోపతి ఆధ్వర్యంలో  కవితా దినోత్సవం నిర్వహిం చారు. కార్యక్రమంలో తెరవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గాజోజు నాగభూషణం, బూర్ల వేంకటేశ్వర్లు, కూకట్ల తిరుపతి, సీవీ కుమార్‌, దామరకుంట శంకరయ్య, మమత వేణు, పలువురు కవులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-03-22T05:26:14+05:30 IST