పోలీసు నివాస గృహాలకు ప్రణాళికలు

ABN , First Publish Date - 2021-02-27T04:46:44+05:30 IST

రాబోయే ఆర్థిక సంవత్సరంలో పోలీస్‌ సిబ్బంది నివా స గృహాల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌ పేర్కొన్నారు.

పోలీసు నివాస గృహాలకు ప్రణాళికలు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కోలేటి దామోదర్‌

- పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌

కోల్‌సిటీ, ఫిబ్రవరి 26: రాబోయే ఆర్థిక సంవత్సరంలో పోలీస్‌ సిబ్బంది నివా స గృహాల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌ పేర్కొన్నారు. శుక్రవారం రామగుండం పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణ, నగర పాలక సంస్థ కమిషనర్‌ ఉదయ్‌కుమార్‌లతో కలిసి నిర్మాణంలో ఉన్న పోలీస్‌ గెస్ట్‌హౌస్‌, గోదావరిఖని వన్‌టౌన్‌ మోడల్‌ పో లీస్‌ స్టేషన్‌లను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ పోలీస్‌ భవనాలే కాకుండా కార్పొరేట్‌ స్థాయిలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. భవనాలు కార్యాలయాల నిర్వహణకు అనుగుణంగా ఫర్నీచర్‌ ఏర్పాటుచేస్తున్నామన్నారు. సింగరేణి, ఎన్‌టీపీసీ సహకారంతో గోదావరిఖనిలో మోడల్‌ పోలీస్‌ స్టేషన్‌, పోలీస్‌ గెస్ట్‌హౌస్‌ నిర్మిస్తున్నామన్నారు. రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ భవన నిర్మాణ పనులు 90శాతం పూర్తయ్యాయని, కమిషనరేట్‌లోని అన్ని పోలీస్‌స్టేషన్‌ల లో ఏర్పాటు చేసిన సీసీకెమెరాలను కమిషనరేట్‌లోని కంట్రోల్‌ రూమ్‌కు అను సంధానించడం, ఇక్కడి నుంచి హైదరాబాద్‌లోని కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌కు అనుసంఽదానం చేయాలని డీజీపీ భావిస్తున్నారన్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి, నార్త్‌జోన్‌ ఐజీ నాగిరెడ్డి భవనాలను పరిశీలించిన అనంతరం ప్రారంభోత్సవ తే దీలు ఖరారు చేస్తామన్నారు. రెండు నెలల్లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా రామగుండం, సిద్ధిపేట పోలీస్‌కమిషనరేట్‌లు ప్రారంభిస్తామని తెలిపారు. వెం ట పెద్దపల్లి డీసీపీ రవీందర్‌, అడిషనల్‌ డీసీపీ(ఏఆర్‌) సంజీవ్‌, ట్రాఫిక్‌ ఏసీపీ బాలరాజు, సీఐలు రమేష్‌బాబు, రాజ్‌కుమార్‌, ప్రవీణ్‌, ఆర్‌ఐ మధుకర్‌, హౌసిం గ్‌ కార్పొరేషన్‌ డీఈ విశ్వనాథం, ఏఈ సాయిచంద్‌, వినయ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-27T04:46:44+05:30 IST