క్యాంపునకు తరలిన గులాబీ నేతలు

ABN , First Publish Date - 2021-11-28T05:51:30+05:30 IST

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రామగుండం నియోజకవర్గానికి చెందిన టీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు క్యాంపునకు తరలివెళ్లారు.

క్యాంపునకు తరలిన గులాబీ నేతలు
క్యాంపునకు వెళుతున్న కార్పొరేటర్లు, కుటుంబ సభ్యులు

కోల్‌సిటీ, నవంబరు 27: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రామగుండం నియోజకవర్గానికి చెందిన టీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు క్యాంపునకు తరలివెళ్లారు. కార్పొరేటర్‌ సాగంటి శంకర్‌ మినహా మిగిలిన టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు, అంతర్గాం, పాలకుర్తి మండలాలకు చెందిన ఎంపీటీసీలు, ఎంపీపీలు క్యాంపునకు పయనమయ్యారు. మహిళా ప్రజా ప్రతినిధులు వారి కుటుంబ సభ్యులతో క్యాంపునకు వెళ్లారు. రామగుండం శాసన సభ్యుడు కోరుకంటి చందర్‌, నగర మేయర్‌ అనీల్‌ కుమార్‌, డిప్యూటీ మేయర్‌ అభిషేక్‌రావు, ఇతర టీఆర్‌ఎస్‌ నాయకులు గోదావరిఖనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి బస్సుల్లో తరలివెళ్లారు. హైదరాబాద్‌ శివారులోని ఒక ఫంక్షన్‌హాల్‌కు వీరిని తీసుకెళ్లారు. అక్కడి నుంచి బెంగుళూరు, ఇతర ప్రాంతాల్లోని క్యాంపులకు తరలించనున్నట్టు సమాచారం.

Updated Date - 2021-11-28T05:51:30+05:30 IST