సైబర్‌ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-08-20T06:08:50+05:30 IST

సాంకేతిక వినియోగం ఎక్కువ కావడం వల్ల సైబర్‌ నేరాల సంఖ్య పెరుగుతోందని, ప్రజలు ఈ నేరాల పట్ల అప్ర మత్తంగా ఉండాలని ఎస్పీ సింధు శర్మ అన్నారు.

సైబర్‌ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ

మోసాలకు గురైతే 100 డయల్‌కు ఫిర్యాదు చేయాలి

 ఎస్పీ సింధు శర్మ

జగిత్యాల టౌన్‌, ఆగస్టు 19 : సాంకేతిక వినియోగం ఎక్కువ కావడం వల్ల సైబర్‌ నేరాల సంఖ్య పెరుగుతోందని, ప్రజలు ఈ నేరాల పట్ల అప్ర మత్తంగా ఉండాలని ఎస్పీ సింధు శర్మ అన్నారు. జిల్లా కేంద్రంలోని ట్రా ఫిక్‌ శిక్షణ కేంద్రంలో గురువారం సింధు శర్మ విలేకరుల సమావేశం ని ర్వహించి మాట్లాడారు. సైబర్‌ నేరాలకు చెక్‌ పెట్టడం, ప్రజలకు మరిం త సమర్థవంతంగా సేవలందించడం లక్ష్యంగా జిల్లా పోలీస్‌ శాఖ పని చేస్తుందని వివరించారు. సైబర్‌ నేరగాళ్ల వలలో పడి ఎవరైనా నగదును నష్టపోతే వెంటనే సైబర్‌ హెల్ప్‌లైన్‌ నంబర్లయిన డయల్‌ 100, 155260, 112 నంబర్లకు తక్షణమే ఫోన్‌ చేయాలని కోరారు. తక్షణ ఫిర్యాదుతో పో గొట్లుకున్న నగదును తిరిగి పొందడానికి అవకాశం ఉంటుందన్నారు. ఫి ర్యాదు అందిన వెంటనే సంబంధిత పోలీస్‌ అధికారులు త్వరితగతిన కే సును పరిశీలించి బ్యాంకులకు, ఇతర వ్యాలెట్‌లకు సమాచారం అందిస్తా రని పేర్కొన్నారు. అనంతరం సైబర్‌ నేరగాళ్లు పాల్పడే నేరాలను పవర్‌ పాయింట్‌ ప్రొజెక్టర్‌ ద్వారా వివరించారు. ముఖ్యంగా ఏటీఎం డెబిట్‌, క్రె డిట్‌ కార్డుల వివరాలు, ఓటీపి నెంబర్లను, పాస్‌ వర్డ్‌లను ఇతరులకు స మాచారం ఇవ్వకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో అ దనపు ఎస్పీ సురేష్‌ కుమార్‌, సైబర్‌ టీం పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.

నేర విచారణ మరింత సమర్థవంతంగా ఉండాలి

నేర విచారణ మరింత సమర్థవంతంగా చేయడంతో పాటు కేసులను సత్వరమే పరిష్కరించే విధంగా పోలీస్‌ అధికారులు పనిచేయాలని  ఎస్పీ సింధు శర్మ అన్నారు. జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో నేర సమీక్ష సమావేశాన్ని ఎస్పీ నిర్వహించారు. మారుతున్న పరిస్థితులకు అ నుగుణంగా నేర విచారణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ముందుకు సాగలన్నారు. నమోదయ్యే ప్రతి కేసు వివరాలను అన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. సమావేశంలో డీఎస్పీలు గౌస్‌ బాబా, రాఘవేంధ్ర రావు, సీఐలు రాజశేఖర్‌ రాజు, శ్రీనివాస్‌, ఐటీ కోర్‌ ఇన్స్‌ఫెక్టర్‌ సరీలాల్‌ ఉన్నారు.


Updated Date - 2021-08-20T06:08:50+05:30 IST