పాలియేటివ్ కేర్ సెంటర్ పనులను పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2021-10-29T05:29:24+05:30 IST
వేములవాడ ప్రాంతీయ ఆస్పత్రిలో నిర్మా ణంలో ఉన్న పాలియేటివ్ కేర్ సెంటర్ పనులను త్వరి తగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు.

- కలెక్టర్ అనురాగ్ జయంతి
వేములవాడ టౌన్, అక్టోబరు 28 : వేములవాడ ప్రాంతీయ ఆస్పత్రిలో నిర్మా ణంలో ఉన్న పాలియేటివ్ కేర్ సెంటర్ పనులను త్వరి తగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. ప్రాంతీయ ఆస్పత్రిలో ప్రగ తిలో ఉన్న పనులను గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని, వసతుల కల్పనలో ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. వైద్య సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ రేగులపాటి మహేష్‌రావు ఉన్నారు.