గోదావరిఖనిలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2021-10-08T05:29:11+05:30 IST

దేశవ్యాప్తంగా 35 ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన ఆక్సిజన్‌ ప్లాంట్లను గురువారం వర్చువల్‌ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారం భించారు.

గోదావరిఖనిలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ప్రారంభం
ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ప్రారంభిస్తున్న కలెక్టర్‌ సంగీత సత్యనారాయణ

కళ్యాణ్‌నగర్‌, అక్టోబరు 7: దేశవ్యాప్తంగా 35 ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన ఆక్సిజన్‌ ప్లాంట్లను గురువారం వర్చువల్‌ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారం భించారు. గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్‌ ప్లాంట్‌ను కలెక్టర్‌ సంగీత సత్యనారాయణ, నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రాజె క్టు డైరెక్టర్‌ రవీందర్‌రావు ప్రారంభించారు. కరోనా రెండోదశలో ఆక్సిజన్‌ లభించ క చాలామంది మృత్యువాతపడ్డారు. దీంతో అప్పుడు ఆక్సిజన్‌ కొరత తీర్చడానికి గాను జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు, ఏరియాఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ కొర త తీర్చడానికి నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ఇండియా ఆధ్వర్యంలో ఆక్సిజన్‌ప్లాం ట్ల ఏర్పాటుకు శ్రీకారంచుట్టారు. మేనెలలో ఈ ప్లాంట్‌ ఏర్పాటుకు పీడీ రవీందర్‌రావు శంకుస్థాపన చేయగా పనులను వేగవంతంగా పూర్తిచేసి అందుబాటులో కి తీసుకువచ్చారు. రోజుకు 250మందికి సరిపడా ఆక్సిజన్‌ అందించే ఈ ప్లాంట్‌ ఏర్పాటుతో రోగుల కష్టాలు తీరనున్నాయి. కార్యక్రమంలో మేయర్‌ బంగి అనీల్‌ కుమార్‌, కమిషనర్‌ శంకర్‌కుమార్‌, డిప్యూటీమేయర్‌ అభిషేక్‌రావు, డీఎంహెచ్‌ ఓ ప్రమోద్‌కుమార్‌, డీహెచ్‌ఎస్‌ వాసుదేవరెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ శ్రీ నివాస్‌రెడ్డి, ఈడీఎం కవిత, రమేష్‌, కౌన్సిలర్‌ సుమలత, చంద్రకళ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-08T05:29:11+05:30 IST