ఓం నమో.. నమశ్శివాయ
ABN , First Publish Date - 2021-03-11T05:24:11+05:30 IST
: మహాశివరాత్రి పర్వదినాన్ని గురువారం భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోనున్నారు. సంవత్సరంలో వచ్చే 12 మాస శివరాత్రులలో మాఘబహుళ చతుర్థశి పరమశివునికి ప్రీతిపాత్రమైనదిగా భక్తులు విశ్వసిస్తారు.
జిల్లాలోని ఆలయాలు ముస్తాబు
నేడు మహా శివరాత్రి
కరీంనగర్ కల్చరల్, మార్చి 10: మహాశివరాత్రి పర్వదినాన్ని గురువారం భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోనున్నారు. సంవత్సరంలో వచ్చే 12 మాస శివరాత్రులలో మాఘబహుళ చతుర్థశి పరమశివునికి ప్రీతిపాత్రమైనదిగా భక్తులు విశ్వసిస్తారు. శివుడు జ్యోతిస్ఫటిక లింగాకారంల శివరాత్రి అర్థరాత్రి ఉద్భవించి నట్లు పురాణాలు చెబుతున్నాయి. యావద్భారత దేశంలో భక్తులు ఉపవాస దీక్షనుబూని ప్రత్యేక పూజలు, అర్చనలు, జాగరణలు చేస్తారు. లయ కారకుడైన శివున్ని పూజిస్తే భవానీసమేత శంకరుడు సకల శుభాలనిస్తాడని, ఉపవాసదీక్ష, ఫలరసపంచామృతాభిషేకములు, బిల్వదళార్చనల వల్ల విశేషఫలితం, పుణ్యం దక్కుతుందని శివపురాణం చెబుతుంది. లింగోద్భవకాలం అంటే రాత్రి 12 గం టల తర్వాత సమయంలో అభిషేకం చేయాలని శైవాగమం చెబుతుంది. మహాశివరాత్రి సందర్భంగా జిల్లా కేంద్రంలోని శివాలయాలు ముస్తాబయ్యా యి. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా జిల్లా కేంద్రంలోని శివాలయాలు ముస్తాబయ్యాయి. గురువారం జరిగే వేడుకలకు ఆయా ఆలయాల నిర్వాహకులు, అధికారులు, పాలకవర్గం, సిబ్బంది ఏర్పాట్లు చేశారు. అన్ని శివాలయా ల్లో ఉదయం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు అభిషేక అర్చనలు, అలంకారాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, జాగరణలు జరుగను న్నాయి. రమేశ్, సర్వే, ల్యాండ్ రికార్డ్స్ ఏడీ అశోక్ తదితరులు పాల్గొన్నారు.
మార్కెట్‌లో శివరాత్రి సందడి
మహా శివరాత్రి సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రధాన మార్కెట్‌లో సందడి కనిపించింది. ప్రజ లు పూజా సామగ్రి తో పాటు పూలు, పండ్లు కొనుగోలు చేశారు. బుధవా రం రాత్రి వరకు వివిధ గ్రామాల నుంచి అమ్మకందారులు పూజాసామగ్రి, పూలు, పండ్లను తెచ్చి విక్రయించారు.