కొత్త ఆశలు...కొంగొత్త ఆశయాలతో
ABN , First Publish Date - 2022-01-01T04:56:01+05:30 IST
కాలగమనంలో మరో ఏడాది కనమరుగు...కొత్త ఆశలు...కొంగొత్త ఆశయాల తో నూతన సంవత్సరంలోకి తొలి అడుగు...

- 2021 నూతన సంవత్సరానికి స్వాగతం అంటున్న నేతలు, అధికారులు
- మరింత ఉత్సాహంతో మరో వసంతంలోకి
జగిత్యాల, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): కాలగమనంలో మరో ఏడాది కనమరుగు...కొత్త ఆశలు...కొంగొత్త ఆశయాల తో నూతన సంవత్సరంలోకి తొలి అడుగు...కరోనా మిగిల్చిన చేదు అనుభవాలతోనే గతేడాది గడిచిపోయింది. అనేక ఆశ లతో మరో సంవత్సరం ఆరంభమైంది. 2021 మిగల్చిన తీ పి, చేదు జ్ఞాపకాలను నెమరువేసు కుంటూ....2022లోనైనా మంచి జరగాలని...కష్టాలు తొలిగి జన జీవనం సాధారణ స్థితికి రావాలన్నదే అందరి ఆశ. కొత్త సంవత్సరంలో లక్ష్యా లు అందుకోవాలని, అందరికి శుభాలు కలగాలని ప్రజాప్ర తినిధులు, అధికారులు ఆకాంక్షించారు. పలువురు ఇళ్లలోనే కేకులు కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నా రు. జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు గడిచిన ఏడాది అనుభవాలు, కొత్త ఏడాది భవిష్యత్ ప్రణాళిక తదితర అంశాలపై ‘ఆంధ్రజ్యోతి’తో పం చుకున్న అభిప్రాయాలు వారి మాటల్లోనే....
రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత పురోగమించాలి
- కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి
నూతన సంవత్సరంలో రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత పురోగమించాలి. తెలంగాణ వాసులతో పాటు దేశ, విదేశాల లో నివసిస్తున్న తెలంగాణ బిడ్డలందరూ శుభం కలగాలి. కొత్త సంవత్సరంలో జిల్లాకు మంజూరు అయిన ఇథనాల్ కర్మాగారం ప్రారంభించుకునే విధంగా ప్రయత్నాలు చేస్తా ను. జిల్లాను అభివృద్ధి, సంక్షేమంలో మరింత ముందుకు తీ సుకవెళ్తాను.
ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని ఆశిస్తున్నాం...
- డాక్టర్ సంజయ్ కుమార్, ఎమ్మెల్యే, జగిత్యాల
జగిత్యాల సెగ్మెంట్‌లో ప్రజలకు మరింత మెరుగైన సేవ లను వచ్చే కొత్తయేడాదిలో అందించాలని ఆశిస్తున్నాం. ఎల్ల వేళల ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయ డమే ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్తా. సీఎం కేసీఆర్ జిలా ్లకు మంజూరు చేసిన మెడికల్ కళాశాల, అనుబంద ఆసు పత్రి తదితర వాటిని కొత్త సంవత్సరంలో ప్రారంభించ డానికి అవసరమైన కృషి చేస్తాను.
కోరుట్ల సెగ్మెంట్‌లో మరింత అభివృద్ధికి కృషి
- కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ఎమ్మెల్యే, కోరుట్ల
గడిచిన యేడాది కోరుట్ల నియోజకవర్గంలో గతంలో ఎ న్నడూ జరగని విధంగా రూ. కోట్లాది నిధులతో అనేక అభి వృద్ధి పనులు జరిగాయి. వచ్చే యేడాది సైతం అభివృద్ధి పనులు యధావిధిగా కొనసాగిస్తూ ఇంటింటికీ తాగునీరు అందించేలా, గ్రామాల్లో రహదారులు ఏర్పాటు చేసేలా కృ షి చేస్తాం.
ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలి
- గుగులోతు రవి నాయక్, కలెక్టర్,
ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆశిస్తున్నా ను. వర్షాలు కురిసి పంటలు పండి ప్రజలు సంతోషంగా జీవించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా మహిళలు, రైతులు, యువత ఆయా రంగాల్లో మరింత రాణించి పేరు ప్రఖ్యాతలు సాధించాలని కోరుకుంటున్నా.
పౌరుల భాగస్వామ్యంతోనే నేరాల నియంత్రణ
- సింధూ శర్మ, ఎస్పీ, జగిత్యాల
నూతన సంత్సరంలో నేరాల నియంత్రణలో పౌరుల భాగస్వామ్యం మరింత అవసరం. ప్రతీ ఒక్కరు శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసులకు సహకరించడం సామాజిక బాధ్యతగా స్వీకరించాలి. కొత్త ఏడాదిలో ప్రజలందరికి మంచి జరగాలి. పౌరులందరు భాగస్వామ్య అయితేనే సమాజంలో నేరాల నియంత్రణ మరింత సులువవుతుంది. ఈ దిశగా అవసరమైన అడుగులు వేయాలి.
కొత్తయేడాదిలో సుఖసంతోషాలు విరియాలి
- దావ వసంత, జడ్పీ చైర్‌పర్సన్, జగిత్యాల
కొత్త ఏడాదిలో అందరికి సుఖశాంతులు విరియాలని కో రుకుంటున్నాను. కష్టాలను మరిచిపోయి కొత్త సంవత్సరా నికి సాదర స్వాగతం పలుకుతూ అదే సమయంలో పాత సంవత్సరానికి వీడ్కోలు పలకడం ఆనవాయితీ. జిల్లాలోని ప్రజలు, అన్ని వర్గాల నాయకులు, అధికారులు, ఉద్యోగులు ఇలా ప్రతీ ఒక్కరూ అభివృద్ధి, సంక్షేమంలో భాగస్వామ్యులు కావాలి.