నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2021-11-02T05:38:46+05:30 IST

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఆ దిశగా పార్లమెంటును స్థంభింపజేసి రాష్ట్రం కేంద్రంపై ఒత్తిడి తే వాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు.

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి
విలేఖరులతో మాట్లాడుతున్న జీవన్‌రెడ్డి

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

రాయికల్‌, నవంబరు 1: నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఆ దిశగా పార్లమెంటును స్థంభింపజేసి రాష్ట్రం కేంద్రంపై ఒత్తిడి తే వాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. రాయికల్‌లో సోమవారం ఆయన వి లేఖరులతో మాట్లాడుతూ ప్రభుత్వం వరి చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని చెప్తూ వరి వేస్తే ఉరి అనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని అన్నా రు. అతివృష్టి, భూగర్భ జలమట్టం పెరిగి తేమ శాతం పెరగడంతో వరి తప్ప ఇతర పంటలు సాగుచేసే పరిస్థితి లేదని అన్నారు. వరికి బదులు ఇతర పంటలు చేస్తే గిట్టుబాటు ధర కల్పిస్తారా అని ప్రశ్నించారు. చెక్కర ఫ్యాక్టరీని తెరిపిస్తే వరి బదులు రైతులు చెరుకు సాగుచేస్తారని దాన్ని తెరిపించడంతో పాటు పరిశ్రమలకు ఇచ్చే విధంగా విద్యుత్‌రాయి తీ కల్పించాలన్నారు. వరి ధాన్యం కొనుగోలుకు కేంద్రం సహ కరించన ప్పుడు కేంద్రం అమలు చేస్తున్న ప్రతీ బిల్లును టీఆర్‌ఎస్‌ పార్టీ ఎం దు కు సమర్థిస్తుందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఒక ఉద్యమనాయకుడిగా ఏవిధంగానైతే రాష్ట్రం తెచ్చాడో అదే విధంగా కేంద్రంపై ఉద్యమం ప్రక టించాలని తాము దానిని సమర్థిస్తామని అన్నారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ పార్టీలు రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నా యని అన్నారు. రబీలో 100శాతం రుణ ప్రణాళిక అమలుపై తక్షణం ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలని అన్నారు. ఒక్క హుజు రాబాద్‌లో తప్ప ఎక్కడా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదని వెంటనే కొనుగోలు కేంద్రాలుప్రారంభించి ధాన్యం కొనుగోలు చేయాలని అన్నారు. వీరివెంట నాయకులు రవీంధర్‌రావు, మహేంధర్‌గౌడ్‌, గోపిరాజరెడ్డి, దివా కర్‌, భూమయ్య, మహిపాల్‌, నర్సయ్య, మున్ను, నర్శింహరెడ్డి, రమేష్‌, ముజాయిద్‌ ఉన్నారు.

Updated Date - 2021-11-02T05:38:46+05:30 IST