పోలియో రహిత భవిష్యత్తును అందించాలి

ABN , First Publish Date - 2021-02-01T06:30:34+05:30 IST

అపుడే పుట్టిన పసిబిడ్డ నుండి 5 సంవత్సారాలలోపు పిల్లలందరికీ పల్స్‌ పోలియో చుక్కలను అందించి పోలియో రహిత భవిష్యత్తును అందింద్దామని జగిత్యాల జిల్లా కలెక్టర్‌ రవి అన్నారు.

పోలియో రహిత భవిష్యత్తును అందించాలి
పోలియో చుక్కలు వేస్తున్న కలెక్టర్‌ రవి

 జగిత్యాల జిల్లా కలెక్టర్‌ రవి

జగిత్యాల టౌన్‌, జనవరి 31 : అపుడే పుట్టిన పసిబిడ్డ నుండి 5 సంవత్సారాలలోపు పిల్లలందరికీ పల్స్‌ పోలియో చుక్కలను అందించి  పోలియో రహిత భవిష్యత్తును అందింద్దామని జగిత్యాల జిల్లా కలెక్టర్‌ రవి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఖిలా గడ్డ ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ రవి, ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌, బల్దియా చైర్‌ పర్సన్‌ బోగ శ్రావణిలు చిన్నారులకు పల్స్‌ పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్‌ రవి మాట్లాడుతూ జిల్లాను పోలియో రహిత జిల్లాగా మార్చేలా ప్రతి తల్లిదండ్రి తమ చిన్నారులకు తప్పని సరిగా చుక్కల మందు వేయిం చాలన్నారు. జిల్లా వ్యాప్తంగా జీరో నుంచి 5 సంవత్సారాలలోపు సుమారు 94,860 మందికి చుక్కలు వేసేందుకు 507 కేంద్రాలను, 13 ట్రాన్‌సీట్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. 173 హైరిస్క్‌ ఏరియాలను గుర్తించి అక్కడ ఉన్న చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు 21 ప్రత్యేక మోబైల్‌ టీములు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమం కోసం 2028 మంది సిబ్బందిని, 51 రూట్లకు ఒక సూపర్‌ వైజర్‌ను నియమించి కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రెండు దఫాలుగా పోలియో వ్యాక్సినేషన్‌  కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైధ్యాధికారి శ్రీధర్‌, వైస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌ పోగ్రాం అధికారి శంశోధ్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-02-01T06:30:34+05:30 IST