పేదలను ఆదుకోవడానికి ముందుకు రావాలి
ABN , First Publish Date - 2021-08-03T05:43:52+05:30 IST
సమాజంలో పేదలను ఆదుకోవడానికి ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలని ముఖ్యంగా వారి ఆకలి తీర్చ డానికి ప్రయత్నించాలని సుల్తానాబాద్ సీఐ ఇంద్రసేనారెడ్డి అన్నారు.

సుల్తానాబాద్, ఆగస్టు2: సమాజంలో పేదలను ఆదుకోవడానికి ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలని ముఖ్యంగా వారి ఆకలి తీర్చ డానికి ప్రయత్నించాలని సుల్తానాబాద్ సీఐ ఇంద్రసేనారెడ్డి అన్నారు. పలువురు దాతల సహకారంతో సుల్తానాబాద్ పట్ట ణంలో తుమ్మ రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అన్న దాన కార్యక్రమం వంద రోజులు పూర్తిచేసుకున్న సందర్భంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఐ, ఎస్ఐల ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. సోమ వారం కొమురవెల్లి అంజయ్య భాస్కర్ సత్యం, మాజీ ఎంపీటీసీ డీకొండ భూమేష్ తదితరుల కుటుంబ సభ్యులు అన్నదానం చేశారు. ఈ కార్య క్రమంలో లోక్‌అదాలత్ సభ్యులు పల్లా కిషన్, రాజేంద్రప్రసాద్, నిశాంత్, ప్రసాద్, నగేశ్ జూపా క స్వామి, రమేష్, దేవేందర్, నరేష్ పాల్గొన్నారు.