పోలియోరహిత దేశంగా తీర్చిదిద్దాలి

ABN , First Publish Date - 2021-02-01T06:46:06+05:30 IST

పోలియో రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు.

పోలియోరహిత దేశంగా తీర్చిదిద్దాలి
సుల్తానాబాద్‌లో చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్న ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి

- పల్స్‌పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రడ్డి

సుల్తానాబాద్‌, జనవరి 31: పోలియో రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. సుల్తానాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో పోలియో కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఆనంతరం చిన్నారులకు చుక్కల మందు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో పోలి యో ఎక్కడా లేకుండా పోవాలని, ఐదేళ్లలోపు పిల్లలందరూ ఆరోగ్యంగా ఎదగాలని పోలియో చుక్కల కార్యక్రమాన్ని చేపడుతున్నారన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి ప్రమోద్‌కుమార్‌ మాట్లాడుతూ జిల్లావ్యా ప్తంగా 63 వేల 508 మంది చిన్నారులను గుర్తించామని, వారందరికీ చుక్కల మందు వేయించేందుకు జిల్లావ్యాప్తంగా 400కేంద్రాలను ఏర్పా టుచేశామని, ఇవి కాకుండా మరో 24 సంచార బృందాలు కూడా ఉన్నా యన్నారు. జిల్లాలోని నాలుగు రైల్యేస్టేషన్లలో, ఆరు ఆర్టీసీ బస్టాండ్లలో కూడా చుక్కల మందు పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరిం చారు. ఆదివారం ఆయా కేంద్రాలలో చుక్కలు వేశాక ఇంకా మిగిలి ఉన్న వారి కోసం వైద్య బృందాలు మరో రెండు రోజుల పాటు ఇంటింటికీ వెళ్లి చిన్నారులను గుర్తించి వారికి చుక్కల మందు వేస్తాయన్నారు. ఈ కార్య క్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కృపారాణి, డాక్టర్లు శ్రీనివాస శ్రీరాం, చంద్రశేఖర్‌, తిరుమల, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ముత్యం సునిత రమేష్‌, ఎంపీపీ బాలాజీరావు, జడ్పీటీసీ మినుపాల స్వరూపారాణి, మా ర్కెట్‌ కమిటీ చైర్మన్‌ బుర్ర శ్రీనివాస్‌, వైస్‌చైర్మన్‌ అన్నేడి మహిపాల్‌ రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్‌ శ్రీగిరి శ్రీనివాస్‌, నిశాంత్‌రెడ్డి, కమిషనర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, కౌన్సిలర్‌ అరుణబాబురావు, ఐల రమేష్‌, పాల రామారావు, కలీం, గుర్రాల శ్రీనివాస్‌, సర్వర్‌, పొన్నం చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-01T06:46:06+05:30 IST