స్మార్ట్‌సిటీ పనులపై దృష్టి
ABN , First Publish Date - 2021-12-26T05:30:00+05:30 IST
కరీంనగర్‌లో స్మార్ట్‌సిటీ పనులను వేగంగా పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టిసారి స్తున్నారు. ఇప్పటి వరకు మొదటి, రెండో విడతలో జరిగిన పనుల పురోగతి, పనుల్లో జరుగుతున్న జాప్యం, నాణ్యతా ప్రమాణాలు ఇతరత్రా అంశాలపై సమగ్రంగా చర్చించను న్నారు.

మొదటి విడత రూ.353 కోట్ల పనుల్లో 70 శాతం పూర్తి
టెండర్ దశలో రూ.101 కోట్ల రెండో విడత పనులు
మూడో విడతలో 315 కోట్లతో డీపీఆర్ సిద్ధం
మార్చిలోపు టెండర్ల పూర్తి చేసేందుకు కార్యాచరణ
నేడు సమీక్ష నిర్వహించనున్న మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్ టౌన్, డిసెంబరు 26: కరీంనగర్‌లో స్మార్ట్‌సిటీ పనులను వేగంగా పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టిసారి స్తున్నారు. ఇప్పటి వరకు మొదటి, రెండో విడతలో జరిగిన పనుల పురోగతి, పనుల్లో జరుగుతున్న జాప్యం, నాణ్యతా ప్రమాణాలు ఇతరత్రా అంశాలపై సమగ్రంగా చర్చించను న్నారు. మూడో విడతలో చేపట్టాల్సిన డీపీఆర్‌ను రూపొం దించుకొని త్వరలో జరుగనున్న స్మార్ట్‌సిటీ బోర్డు సమా వేశంలో పరిపాలనా మంజూరు పొందే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ సోమవా రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మేయర్ యాదగిరి సునీల్‌రావు, మున్సిపల్ కమిష నర్ సేవా ఇస్లావత్‌తోపాటు స్మార్ట్‌సిటీ కన్సల్టెన్సీ ప్రతి నిధులు, వివిధ శాఖల అధికారులతో స్మార్ట్‌సిటీపై సమీక్షా సమావే శాన్ని ఏర్పాటు చేశారు.

ఇటీవల కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ నగరంలో స్మార్ట్‌సిటీ పనుల్లో జాప్యం జరుగుతోందని, నాణ్యాతా ప్రమాణాలను పాటించడం లేదని, రాష్ట్ర ప్రభు త్వం తమ వాటా చెల్లించకుండా పథకాన్ని నీరుకారు స్తోందని కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు. బీజేపీ ఆధ్వర్యం లో మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశంలో అనేక అంశాలు చర్చకు వచ్చే అవకాశాలున్నాయి.
పనుల వేగవంతానికి చర్యలు
మొదటి విడతలో కరీంనగర్‌కు 353 కోట్లు విడుదల కాగా వాటిలో దాదాపు ఇప్పటికే 70 శాతం పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. మిగిలిన వాటిలో అన్ని పనులు పురోగతిలో ఉండగా వాటిని వేగంగా పూర్తి చేసేం దుకు అవసరమైన చర్యలపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. రెండో విడతలో 101 కోట్లు రూపా యలతో చేపట్టనున్న పనులకు సంబంధించి టెండర్లు దాదాపుగా పూర్తయినప్పటికి కొవిడ్, ఉప ఎన్నికలు, శాసన మండలి ఎన్నికల కోడ్ కారణంగా టెండర్లలో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లకు వర్క ఆర్డర్ ఇచ్చి టెండర్ ప్రక్రియ పూర్తి చేయలేక పోయారు. వాటిపై కూడా చర్చిం చే అవకాశముంది. త్వరలో హైదరాబాద్‌లో జరుగనున్న స్మార్ట్‌సిటీ కంపెనీ లిమిటెడ్ బోర్డు సమావేశంలో మూడో విడతలో చేపట్టాల్సిన దాదాపు 315 కోట్లతో రూపొందించిన డీపీఆర్‌కు అడ్మినిస్ట్రేషన్ సాంక్షన్ తీసుకొని టెండర్లు నిర్వహించి పనులు పూర్తిచేసే అంశాలను చర్చిస్తారని తెలి సింది. మూడో విడతలో ప్రధానంగా 134 కోట్లతో నగరంలో చాలా సంవత్సరాలుగా అమలుకు నోచుకోకుండా ఉన్న వరద మురుగు కాలువల నిర్మాణాలతోపాటు 28 కోట్లతో సీసీటీవీ కెమెరాలు, 16 కోట్లతో ట్రాఫిక్‌సిగ్నల్ స్కూల్, 11 కోట్లతో స్మార్ట్ క్లాస్ రూమ్స్, 30 కోట్లు డంపింగ్‌యార్డు తదితర అంశాలతో డీపీఆర్‌ను రూపొందిస్తున్నట్లు తెలి సింది.
వీటితోపాటు అదనంగా మరికొన్ని అభివృద్ధి పను లను కూడా చేసేందుకు ఈ సమీక్షలో చర్చిస్తారు. అందు కు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు రిపోర్టును సిద్ధం చేసి మార్చి నెలాఖరులోగా దాదాపు అన్ని టెండర్లను పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు మేయర్ యాదగిరి సునీల్‌రావు తెలిపారు. డిసెంబరు 2022 నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, మం త్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాఽధ్య క్షుడు వినోద్‌కుమార్, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో కరీంనగర్‌ను స్మార్ట్‌సిటీగా మార్చేందుకు కృషిచేస్తామని చెప్పారు.