ఎంపీటీసీ, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల రాజీనామా
ABN , First Publish Date - 2021-08-25T06:31:01+05:30 IST
వేములవాడ మం డలం సంకెపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ నిర్లక్ష్యంతో గ్రామాభివృద్ధి కుంటుపడుతోందని ఎంపీటీసీ, ఉపసర్పంచ్‌తోపాటు ఏడుగురు వార్డు సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు.

వేములవాడ టౌన్, ఆగస్టు 24: వేములవాడ మం డలం సంకెపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ నిర్లక్ష్యంతో గ్రామాభివృద్ధి కుంటుపడుతోందని ఎంపీటీసీ, ఉపసర్పంచ్‌తోపాటు ఏడుగురు వార్డు సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో నరేష్‌ఆనంద్‌కు మంగళ వారం రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్యద ర్శితోపాటు సర్పంచ్ భర్త పెత్తనం చేస్తున్నారని, మహిళా వార్డు సభ్యులపై కార్యదర్శి దురుసుగా ప్రవరి ్తస్తున్నారని అన్నారు. ఎంపీటీసీ నిధులకు సంబంధించి ఏడాదిగా తీర్మానం చేయడం లేదని, గ్రామసభలో సర్పంచ్ భర్త వార్డు సభ్యులపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. గ్రామపంచాయతీలో జరుగుతున్న అవినీతిపై చర్యలు తీసుకో వాలని రాజీనామా చేసినట్లు వెల్లడించారు. రాజీనామా చేసిన వారిలో బీజేపీకి చెందిన ఎంపీటీసీ బుర్ర లహరి, ఉపసర్పంచ్ పండుగ పర్శరాములు, వార్డు సభ్యులు లక్ష్మణ్, సంధ్యారాణి, రేఖ, మమత, మౌనిక, మహేష్, చైతన్య ఉన్నారు. వార్డు సభ్యుల్లో పలువురు టీఆర్‌ఎస్‌కు చెందిన వారు ఉండగా మరికొంత మంది బీజేపీకి చెందిన వారు ఉన్నారు. ఈ విషయంపై ఎంపీడీవోను వివరణ కోరగా సంకెపల్లి గ్రామపంచాయతీకి చెందిన ఎంపీటీసీ, ఉసర్పంచ్‌తోపాటు వార్డు సభ్యులు రాజీనామా అందించారని , జిల్లా ఉన్నతాధికారులకు అందించామని తెలిపారు.