విద్యుదాఘాతంతో తల్లీ.. ఆమెను కాపాడబోయి కొడుకు దుర్మరణం

ABN , First Publish Date - 2021-02-05T06:11:18+05:30 IST

విద్యుదాఘాతంతో బావిలో పడి తల్లి మృతి చెందగా త ల్లిని కాపాడేందుకు బావిలోకి దిగిన కొడుకు ఈత రాక అందులో మునిగి మృతి చెం దారు.

విద్యుదాఘాతంతో తల్లీ.. ఆమెను కాపాడబోయి కొడుకు దుర్మరణం
బావివద్ద గుమికూడిన జనం

జగిత్యాల జిల్లా మంక్య్తానాయక్‌ గ్రామంలో విషాదం

రాయికల్‌, ఫిబ్రవరి 4 : విద్యుదాఘాతంతో బావిలో పడి తల్లి మృతి చెందగా త ల్లిని కాపాడేందుకు బావిలోకి దిగిన కొడుకు ఈత రాక అందులో మునిగి మృతి చెం దారు. జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం మంక్త్యానాయక్‌ గ్రామంలో గురువారం జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదం నింపింది. స్థానికుల కథనం ప్రకారం మంతనా యక్‌ తండాకు చెందిన శోభన్‌, జమున(35)లకు నానేశ్వర్‌(15) ఒక్కడే కుమారుడు. కొన్నేళ్లుగా వీరు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తుంటారు. గ్రా మ శివారులో టిపిరెడ్డి నర్సారెడ్డికి చెందిన భూమిని కౌలుకు తీసుకుని వరి, పసు పు పండిస్తున్నారు. గురువారం పొలానికి నీరు పెట్టే నిమిత్తం ముగ్గూరూ కలిసి వ్యవ సాయ భూమి వద్దకు వెళ్లారు. నానేశ్వర్‌ బావి వద్దకు వెళ్లగా మోటార్‌ పనిచే యక పోవడంతో తల్లిని పిలిచాడు. తల్లి జమున మోటార్‌ వద్దకు వెళ్లి బావినుంచి నీటిని తీసుకువచ్చి మోటార్‌లో పోసి స్టార్ట్‌ చేయగా అకస్మాత్తుగా విద్యుత్‌ షాక్‌ తగల డంతో బావిలో పడి మృతి చెందింది. ఇది గమనించిన కొడుకు తల్లిని కాపా డేందు కు బావిలోకి దిగాడు. బావిలో నీళ్లు ఎక్కువగా ఉండటంతో ఈత రాక బావిలో మునిగి నానేశ్వర్‌ కూడా మృతి చెందాడు. గమనించిన శోభన్‌ వెంటనే స్థానికులకు సమాచార మివ్వడంతో వారు బావిలో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను బయటకు తీశారు. సంఘటన స్థలాన్ని సీఐ కృష్ణకుమార్‌, ఎస్‌ఐ ఆరోగ్యం సంద ర్శించి మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పంపి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.Updated Date - 2021-02-05T06:11:18+05:30 IST