ఎన్టీపీసీలో మరిన్ని సౌర వెలుగులు
ABN , First Publish Date - 2021-10-29T05:54:33+05:30 IST
ఎన్టీపీసీలో మరిన్ని సౌర వెలుగులకు శ్రీకా రం చుట్టారు.
- రాష్ట్రంలో తొలి ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు ప్రారంభం
- 17.5 మెగావాట్ల యూనిట్ గ్రిడ్‌కు అనుసంధానం, కమర్షియల్ డిక్లరేషన్
జ్యోతినగర్, అక్టోబరు 28 : ఎన్టీపీసీలో మరిన్ని సౌర వెలుగులకు శ్రీకా రం చుట్టారు. రామగుండం ఎన్టీపీసీలో ఇప్పటికే 10 మెగావాట్ల సౌర వి ద్యుత్ కేంద్రం నడుస్తుండగా మరో 17.5 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉ త్పత్తి మొదలైంది. రాష్ట్రంలో తొలి ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు(నీటిలో తేలి యాడే) గురువారం రామగుండం ఎన్టీపీసీలో ప్రారంభమైంది. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రామగుండం ఎన్టీపీసీకి చెందిన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో నిర్మిస్తున్న 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంటులో తొలిదశలో 17.5 మెగావాట్ల యూనిట్‌ను గురువారం లాంఛనంగా ప్రారంభించారు. నాలు గైదు రోజులుగా ఎన్టీపీసీ యాజమాన్యం ట్రయల్ రన్ నిర్వహిస్తున్నది. రామగుండం ఎన్టీపీసీ సీజీఎం సునిల్‌కుమార్ సోలార్ ప్రాజెక్టును అధి కారికంగా ప్రారంభించి,కమర్షియల్ డిక్లరేషన్(సిడి)గా ప్రకటించారు. నెల రోజులక్రితమే ప్రాజెక్టు తొలిదశ పనులు పూర్తయినప్పటికీ ఎన్టీపీసీ కా ర్పొరేట్ నుంచి తుది అనుమతి కోసం ఎదురుచూశారు. గురువారం ఢిల్లీ ఎన్టీపీసీ కార్పొరేట్ నుంచి అనుమతి లభించడంతో 17.5మెగావాట్ల యూ నిట్‌లో ఉత్పత్తిని లాంఛనంగా ప్రారంభించడంతోపాటు గ్రిడ్‌కు అనుసం ధానం చేశారు. 2.5 మెగావాట్ల 7బ్లాకులను చార్జ్ చేశారు. ప్రతి బ్లాకును ఒక ఫ్లోటింగ్ ప్లాట్‌ఫార్మ్‌పై ఏర్పాటు చేశారు. అలాగే 11,200 సోలార్ మాడ్యూల్స్‌ను అమర్చారు. ఒక్కొక్క ఫ్లోటింగ్ ప్లాట్‌ఫార్మ్‌కు ఒక్కోక్క ఇన్వ ర్టర్, ట్రాన్స్‌ఫార్మర్, హెచ్‌టీ బ్రేకర్‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా వచ్చే విద్యుత్‌ను 33కెవీ భూగర్భ కేబుల్స్ ద్వారా స్విచ్‌యార్డుకు అనుసంధానం చేశారు. కాగా, ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు కమర్షియల్ డిక్లరేషన్ సంద ర్భంగా సీజీఎం సునిల్ కుమార్ ఎన్టీపీసీ అధికారులు, ఏజెన్సీ ప్రతినిధు లు, ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు.
అతిపెద్ద ఫ్లోటింగ్ ప్రాజెక్టు..
ఎన్టీపీసీ రిజర్వాయర్‌లో దేశంలోనే అతిపెద్ద 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు నిర్మాణానానికి 2020లో శ్రీకారం చుట్టారు. అదే ఏడాది అక్టోబరు నాటికి తొలిదశ యూనిట్‌ను ప్రారంభించాలని భావించినప్పటి కీ కొవిడ్ కారణంగా నిర్మాణ పనుల్లో జాప్యం జరిగింది. 2600 మెగావా ట్ల రామగుండం ఎన్టీపీసీకి చెందిన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. 450 ఎకరాల విస్తీర్ణంలో 430 కోట్ల రూపాయల వ్యయంతో 100 మెగావాట్ల ప్లాంటును నెలకొల్పుతున్నారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ బీహెచ్‌ఈఎల్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నది. తొలిదశలో పూర్తయిన 17.5 మెగావాట్ల యూనిట్ పనులు పూర్తికావడం తో ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించి కమర్షియల్ డిక్లరేషన్‌గా ప్రక టించారు. మిగతా 82.5 మెగావాట్ల ప్లాంటు 2022 మార్చి నాటికి పూర్తి చేయనున్నారు. ప్రాజెక్టు పూర్తయితో 100 మెగావాట్ల సామర్థ్యంతో దేశం లోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టుగా గుర్తింపు లభించనుంది. అ లాగే ఈ ప్రాజెక్టు నుంచి పూర్తి విద్యుత్ తెలంగాణకే కేటాయిస్తారు.