ఘనంగా మొహర్రం

ABN , First Publish Date - 2021-08-21T06:28:31+05:30 IST

నగరంలో శుక్రవారం మొహర్రం వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఘనంగా మొహర్రం
చిగురుమామిడి మండలం కొండాపూర్‌లో మొహర్రం వేడుకలకు హాజరైన భక్తులు

కరీంనగర్‌ కల్చరల్‌ ఆగస్టు 20: నగరంలో శుక్రవారం మొహర్రం వేడుకలు ఘనంగా నిర్వహించారు. శోభాయమానంగా అలంకరించిన పీరీల వద్ద ఇమాం హసన్‌, ఇమాం హుస్సేన్‌ల త్యాగనిరతిని కీర్తిస్తూ పాటలు, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పాతబజార్‌ జామా మసీదు ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరి పీరీలను దర్శించుకున్నారు. బత్తీసలు, కుడుకలు, మర్మరాల దండలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మసీదులను, దర్గాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. రాత్రి పొద్దుపోయే వరకు పీరీల దర్శనం కొనసాగింది. Updated Date - 2021-08-21T06:28:31+05:30 IST