నిరాడంబరంగా మే డే

ABN , First Publish Date - 2021-05-02T05:36:39+05:30 IST

అరుణపతాకాలతో మేడే మెరిసిపోయింది. ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని శనివారం జిల్లా వ్యాప్తంగా కార్మి కులు నిరాడంబరంగా జరుపుకున్నారు.

నిరాడంబరంగా మే డే
ఎర్రజెండా ఆవిష్కరిస్తున్న సీపీఎం, సీఐటీయూ నాయకులు

  (ఆంధ్రజ్యోతి సిరిసిల్ల) 

అరుణపతాకాలతో మేడే మెరిసిపోయింది. ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని శనివారం  జిల్లా వ్యాప్తంగా కార్మి కులు నిరాడంబరంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలో సీపీఎం, సీపీఐ, టీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం, ఏఐటీ యూసీ, సీఐటీయూ వివిధ పార్టీల అనుబంధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు నిర్వహించారు. సిరిసిల్లలో సీఐటీయూ, సీపీఎం కార్యాలయం వద్ద పట్ట ణ కార్యదర్శి మూషం రమేష్‌, సీపీఐ కార్యాలయం వద్ద కార్యదర్శి గుంటి వేణు అరుణ పతాకాలను ఎగుర వేశారు.  టీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం ఆధ్వర్యంలో జరిగి న కార్యక్రమాల్లో అధ్యక్షుడు వెంగళ శ్రీనివాస్‌  జెం డాలను ఎగురవేశారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి పాల్గొన్నారు. మున్సిపల్‌ కార్యాలయం వద్ద జరిగిన మేడే ఉత్సవాల్లో చైర్‌పర్సన్‌ జిందం కళ, కమిషనర్‌ సమ్మయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌జిందం కళ మాట్లాడుతూ ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందిన దాని వెనక కార్మికుల  నిర్విరామ శ్రమ దాగి ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కార్మి కుల అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాలను అందిస్తోంద న్నారు. ఆర్టీసీ, సింగరేణి కార్మికులతోపాటు అసంఘటి త రంగంలో ఉన్న కార్మికుల పక్షపాతిగా పని చేస్తోం ద న్నారు. కరోనా కష్ట కాలంలో పారిశుధ్య కార్మికులకు నెలకు రూ.5వేల ప్రోత్సాహాన్ని అందించినట్లు చెప్పారు. లాక్‌డౌన్‌లో పవర్‌లూం కార్మికులకు వెయ్యి రూపాయ ల నగదు, నిత్యావసర సరుకులను పంపిణీ చేశామ న్నారు. బద్దెనపల్లి టెక్స్‌టైల్‌ పార్కు వద్ద యూని యన్‌ కార్యదర్శి రమణ అరుణ పతాకాన్ని ఇవిష్కరించారు.  

సిరిసిల్ల పట్టణంలో...

సిరిసిల్ల టౌన్‌: సిరిసిల్ల పట్టణం సుభాష్‌నగర్‌లోని కార్మిక భవనం ఎదుట సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు ఎర్రజెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చికాగో అమరవీరుల పోరాట స్పూర్తితో హక్కుల సాధన కోసం కార్మికులు ఉద్యమిం చాలన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సామల మల్లేశం, సీపీఐ పట్టణ కార్యదర్శి బూర శ్రీనివాస్‌, నాయకులు కొమరయ్య, చంద్రమౌళి, బొద్దల ధర్మయ్య, రాజశేఖర్‌, కనకయ్య పాల్గొన్నారు.

 సిరిసిల్ల పట్టణం టీఎస్‌ఆర్‌టీసీ డిపో వద్ద  కార్మికులు జెండా ఎగురవేశారు.  కార్మికులు గొట్టె శంకర్‌, గణపతి, రమేష్‌, నర్సయ్య, రవి, బాణయ్య, కుమార్‌, శ్రీను, మహేందర్‌ పాల్గొన్నారు.

 సిరిసిల్ల పట్టణంలోని రైతు బజార్‌, మున్సిపల్‌ కార్యాలయం వద్ద, జిల్లా ప్రధాన వెద్యశాల ఎదుట, బీవై నగర్‌, నెహ్రూనగర్‌, గణేష్‌నగర్‌, చంద్రపేట, సరా ్దపూర్‌లో సీపీఎం,  సీఐటీయూ ఆధ్వర్యంలో  జెండాలు ఎగురవేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మూషం రమే ష్‌, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ మా ట్లాడారు.  నాయకులు రవి, దేవదాస్‌, పద్మ, లక్ష్మణ్‌, రమేష్‌, రాజమల్లు, ఎల్లయ్య, దేవయ్య, నర్సయ్య, కిషన్‌, శంకర్‌, సంపత్‌, చంద్రకాంత్‌, రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-05-02T05:36:39+05:30 IST