వడుకాపూర్‌లో మొబైల్ సైన్స్‌ల్యాబ్
ABN , First Publish Date - 2021-11-28T05:57:19+05:30 IST
మండలంలోని వడుకాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో శనివారం మొబైల్ సైన్స్‌ల్యాబ్ సమావేశాన్ని ఉపాధ్యాయులు నిర్వహించారు.
జూలపల్లి, నవంబర్ 27 : మండలంలోని వడుకాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో శనివారం మొబైల్ సైన్స్‌ల్యాబ్ సమావేశాన్ని ఉపాధ్యాయులు నిర్వహించారు. ఈ సందర్భంగా 6, 10వ తరగతి విద్యార్థులకు మొబైల్ సైన్స్‌ల్యాబ్ ద్వారా గణితం, జీవశాస్త్రం, భౌతికశాస్త్రాలకు సంబంధించిన పలు అంశాలపై అవగాహన కల్పించారు. లాక్డౌన్ నేపథ్యంలో పాఠశాల తరగతులకు దూరమైన విద్యార్థుల అభ్యాసన స్థాయిలను మెరుగుపరిచేందుకు మొబైల్ తరగతులను నిర్వహిస్తున్నట్లు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మొబైల్ సైన్స్ ల్యాబ్ కన్వీనర్ ఎంఏ షేక్, జిల్లా సైన్స్ అధికారి రవిందర్, ఎస్ఎంసీ చైర్మన్ మొదుంపల్లి స్వామి, రిసోర్స్‌పర్సన్స్ ప్రభాకర్, కోదండపాని, వేణుగోపాల్‌రెడ్డి, శివప్ర సాద్, నాగభూషణం, రాములు, లక్ష్మీపతి, రఘునందన్, సురెందర్ తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు.