వైఎస్సార్‌కు భారతరత్న ఇవ్వాలి: జీవన్‌రెడ్డి
ABN , First Publish Date - 2021-07-08T17:55:39+05:30 IST
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి భారత రత్న ఇవ్వాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.

జగిత్యాల: దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి భారత రత్న ఇవ్వాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్సార్ తెలుగువారి ఘనతను ప్రపంచానికి చాటారని తెలిపారు. తెలుగువారిలో భారతరత్నకు అర్హత ఉన్న ఏకైక వ్యక్తి వైఎస్ అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు వైఎస్ హయాంలోనే అంకురార్పణ జరిగిందని తెలిపారు. ప్రాణహిత చేవెళ్లను కేసీఆర్ కాళేశ్వరంగా మార్చారని అన్నారు. వైఎస్ లేకపోతే తెలంగాణ ఎండిపోయేదని ఎమ్మెల్సీ వ్యాఖ్యానించారు. కృష్ణా నదిపై తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టులకు వైఎస్ హయాంలోనే అనుమతులు వచ్చాయని చెప్పారు. ఉమ్మడి ఏపీలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చేపట్టలేదని, ఆ ప్రాజెక్టును అడ్డుకునే హక్కు తెలంగాణకు ఉందని స్పష్టం చేశారు. వైఎస్ తెలంగాణ పక్షపాతి అని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.