మంత్రి మల్లారెడ్డి దిష్టిబొమ్మ దహనం

ABN , First Publish Date - 2021-08-27T06:08:14+05:30 IST

యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో గురువా రం సాయంత్రం ఎన్టీపీసీ మేడిపల్లి సెంటరులో రాష్ట్ర మంత్రి మల్లా రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.

మంత్రి మల్లారెడ్డి దిష్టిబొమ్మ దహనం
ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

జ్యోతినగర్‌, ఆగస్టు 26 : యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో గురువా రం సాయంత్రం ఎన్టీపీసీ మేడిపల్లి సెంటరులో రాష్ట్ర మంత్రి మల్లా రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పై మంత్రి మల్లారెడ్డి పరుష పదజాలంతో దూషించినందుకు నిర సనగా రామగుండం యూత్‌ కాంగ్రెస్‌ శ్రేణులు మంత్రి దిష్టిబొమ్మ ను దహనం చేశారు. ఈసందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు బొం త రాజేశ్‌, మాజీ ఫ్లోర్‌ లీడర్‌ మహంకాళి స్వామి మాట్లాడుతూ దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమం సందర్భంగా మం త్రి మల్లారెడ్డి అక్రమాలను ప్రజలకు వివరించి వారిని చైతన్యవం తుల్ని చేసిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపణలకు సమాధా నం చెప్పకుండా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రి ఇష్టారీ తిన దూషించడం శోచనీయమన్నారు. కాగా, మంత్రి దిష్టిబొమ్మతో శవయాత్ర చేసేందుకు ప్రయత్నించిన నాయకులను ఎన్టీపీసీ పోలీసులు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ దాని అనుబంధ సంఘాల నాయకులు ఫక్రుద్దీన్‌, అంజులు, నజుమొద్దీన్‌, మహేశ్‌, కిరణ్‌, సాయి కిరణ్‌, సతీష్‌, దుర్గాప్రసాద్‌, సురేష్‌, ఘనీ, అజయ్‌, సంతోష్‌, దినేష్‌, రాకేశ్‌, శేఖర్‌, దేవేంద్ర, రాజ్‌కుమార్‌, వైసీసీ శ్రేణులు పాల్గొన్నాయి. 

Updated Date - 2021-08-27T06:08:14+05:30 IST