నేడు మంత్రి కేటీఆర్ పర్యటన
ABN , First Publish Date - 2021-02-01T06:14:49+05:30 IST
పురపాలక ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలో పర్యటించనున్నారు.

- ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
సిరిసిల్ల, జనవరి 31 (ఆంధ్రజ్యోతి)/కోనారా వుపేట/చందుర్తి: పురపాలక ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలో పర్యటించనున్నారు. ఉద యం 11 గంటలకు సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. రూ. మూడు కోట్ల నిధులతో అ భివృద్ధి పరిచిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశా ల ప్రారంభిస్తారు. అనంతరం 12.30 గంటలకు వేములవాడ నియోజకవర్గంలోని కోనరావుపేట మండల కేంద్రంలో రైతు వేదిక, చందుర్తి మండల కేంద్రంలో రైతు వేదికలను ప్రారంభిస్తారు. 3.30 గంటలకు వేము లవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థా నంలో మహా శివరాత్రి ఉత్సవాలపై మంత్రి కేటీఆర్ సమీక్షిస్తారు.
ఫ ఏర్పాట్ల పరిశీలన..
మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్న అభివృద్ధి పనుల ఏర్పాట్లను అదివారం కలెక్టర్ కృష్ణభా స్కర్, ఎస్పీ రాహూల్‌హెగ్డే, జడ్పీ చైర్‌ప ర్సన్ అరుణలు పరిశీలించారు. సిరిసిల్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చందుర్తి కోనరా వుపేటలో రైతు వేదిక భవనాలు పరిశీలించా రు. అధికారులకు పలు సూచనలు చేశారు. వారి వెంట సంబంధిత అధికారులు, ఎంపీడీ వోలు, తహసీల్దార్లు ఉన్నారు.