వేములవాడలో మంత్రి కేటీఆర్ పర్యటన

ABN , First Publish Date - 2021-07-03T18:19:06+05:30 IST

వేములవాడలో మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగుతోంది. హరితహారంలో భాగంగా మంత్రి మొక్కలు

వేములవాడలో మంత్రి కేటీఆర్ పర్యటన

రాజన్న సిరిసిల్ల: వేములవాడలో మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగుతోంది. హరితహారంలో భాగంగా మంత్రి మొక్కలు నాటారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వార్డు కౌన్సిలర్లతో మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు.  పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై వార్డు కౌన్సిలర్లతో చర్చించనున్నారు. 


కాగా మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా బీజేపీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్‌లు చేశారు. మంత్రి కేటీఆర్ కార్యక్రమాలు అడ్డుకుంటారన్న సమాచారంతో బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా పోలీసులు తీరుపై బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు అరెస్టులు ఏంటని ప్రశ్నిస్తూ... ఇక ముందు కేటీఆర్ వస్తే తామే ముందుగా అరెస్ట్ అవుతామని బీజేపీ కార్యకర్తలు చెబుతున్నారు. 

Updated Date - 2021-07-03T18:19:06+05:30 IST