మైక్రోఅబ్జర్వర్లు పోలింగ్‌ ప్రక్రియను నిశితంగా పరిశీలించాలి

ABN , First Publish Date - 2021-10-26T05:01:19+05:30 IST

హుజూరాబాద్‌ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్‌ను మైక్రో అబ్జర్వర్లు నిశితంగా పరిశీలించా లని కేంద్ర ఎన్నికల సాధారణ పరిశీలకుడు ముత్తు కృష్ణన్‌ శంకర్‌ నారాయణ అన్నారు.

మైక్రోఅబ్జర్వర్లు పోలింగ్‌ ప్రక్రియను నిశితంగా పరిశీలించాలి
శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతున్న ముత్తు కృష్ణన్‌ శంకర్‌ నారాయణ

 కేంద్ర ఎన్నికలసాధారణ పరిశీలకుడు ముత్తు కృష్ణన్‌ శంకర్‌ నారాయణ

కరీంనగర్‌, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): హుజూరాబాద్‌ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్‌ను మైక్రో అబ్జర్వర్లు నిశితంగా పరిశీలించా లని కేంద్ర ఎన్నికల సాధారణ పరిశీలకుడు ముత్తు కృష్ణన్‌ శంకర్‌ నారాయణ అన్నారు. సోమవారం కరీంనగర్‌ ఎస్సారార్‌ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలోని కౌంటింగ్‌ కేంద్రంలో మైక్రో అబ్జర్వర్లకు నిర్వహించిన శిక్షణలో ఆయన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ మయాంక్‌ మిట్టల్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముత్తు కృష్ణన్‌ శంకర్‌ నారాయణ , జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌మాట్లాడుతూ మైక్రో అబ్జర్వర్లు పోలింగ్‌ సరళిని సునిశితంగా పరిశీలిస్తూ పోలింగ్‌ సిబ్బందికి తగు సూచనలు ఇవ్వాలని అన్నారు. పోలింగ్‌ రోజు ఉదయం 6 గంటలకల్లా మాక్‌ పోలింగ్‌ నిర్వహించేలా చూడాలని తెలిపారు. మాక్‌ పోలింగ్‌ తర్వాత వీవీ ప్యాట్లలోని స్లిప్పులు తొలగించి సీల్‌ చేసేలా గమనించాలని అన్నారు. పోలింగ్‌ సిబ్బంది కొవిడ్‌ నిబంధనలను కచ్చితంగా పాటించేలా చూడాలని తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల బయట జరిగే హింసాత్మక సంఘటనలపై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని సూచించారు. పోలింగ్‌ ముగిసిన అనంతరంగ్‌ అధికారులు కంట్రోల్‌ యూనిట్‌ బటన్‌ క్లోజ్‌ చేసిన విషయాన్ని ధ్రువీకరించుకోవాలని అన్నారు. ఈ నెల 29వ తేదీన సాయం త్రం 4 గంటలకు హుజూరాబాద్‌ డిస్ర్టిబ్యూషన్‌ సెంటర్‌లో మైక్రో అబ్జర్వర్లు రిపోర్టు చేయాలని, పోలింగ్‌ ముగిశాక పోలింగ్‌ సిబ్బందితో కలిసి ఈవీఎంలను కరీంనగర్‌ ఎస్సారార్‌ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో రిసెప్షన్‌ సెంటర్‌లో అప్ప గించాలని అన్నారు. కార్యక్రమంలో మైక్రో అబ్జర్వర్ల నోడల్‌ అధికారి రాంబాబు, శిక్షణ తరగతి ఇన్‌చార్జి అధికారి బి రవీందర్‌, ఆర్డీవో ఆనంద్‌ కుమార్‌, తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-26T05:01:19+05:30 IST