అంబరాన్నంటిన క్రిస్‌మస్‌ సంబరాలు

ABN , First Publish Date - 2021-12-26T05:25:32+05:30 IST

జగిత్యాల జిల్లాలో శనివారం క్రిస్‌మస్‌ వేడుకలను క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు.

అంబరాన్నంటిన క్రిస్‌మస్‌ సంబరాలు
కేక్‌ కట్‌ చేస్తున్న ఎమ్మెల్యే సంజయ్‌, బల్దియా చైర్‌పర్సన్‌

జగిత్యాల టౌన్‌, డిసెంబర్‌ 25: జగిత్యాల జిల్లాలో శనివారం క్రిస్‌మస్‌ వేడుకలను క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. జగిత్యాల పట్టణంలోని మిషన్‌ కాంపౌండ్‌లో ఉన్న సీఎస్‌ఐ చర్చితో పాటు గోవిందుపల్లెలోని ఏ సురత్నం చర్చి, హౌసింగ్‌ బోర్డులో ఉన్న క్రైస్ట్‌ చర్చిలలో ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌, బల్దియా చైర్‌ పర్సన్‌ బోగ శ్రావ ణితో పాటు కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే తులసీనగర్‌ మేరీ చర్చి, బీట్‌ బజార్‌లోని సెయింట్‌ పాల్‌ చర్చి, నర్సింగాపూర్‌ రోడ్డులోని హెబ్రోను చర్చిలో క్రైస్తవులు ఉదయం నుంచే తరలివచ్చి ప్రార్థనలు చేసి, క్రిస్‌మస్‌ వేడుకలను వైభవంగా జ రుపుకున్నారు. ఈ కార్యక్రమాల్లో చర్చీల ఫాదర్లు, కాంగ్రెస్‌ నాయకులు విజయలక్ష్మి, గిరి నాగ భూషణం, బండ శంకర్‌, గాజుల రాజేందర్‌, పు ప్పాల అశోక్‌ టీఆర్‌ఎస్‌ నాయకులు గోళి శ్రీనివాస్‌, సతీష్‌, మల్లికార్జున్‌, కూతురు రాజేష్‌, ప్రేమలత, మల్లెశం, అనీల్‌, రాము, రాజ్‌కుమార్‌, గంగమల్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-26T05:25:32+05:30 IST