ఎమ్మెల్సీ ఎన్నికలపై టీఆర్‌ఎస్‌శ్రేణుల సమావేశం

ABN , First Publish Date - 2021-11-21T05:46:17+05:30 IST

రాష్ట్రంలో డిసెంబరు 10న నిర్వహించ నున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం టీఆర్‌ఎస్‌ సిద్ధమవుతోంది.

ఎమ్మెల్సీ ఎన్నికలపై టీఆర్‌ఎస్‌శ్రేణుల సమావేశం
టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్న మంత్రి గంగుల కమలాకర్‌

అభ్యర్థుల ఎంపికను పార్టీ అధిష్టానానికి అప్పగిస్తూ ఏకగ్రీవ తీర్మానం 

ఎన్నికలపై దిశానిర్దేశం చేసిన మంత్రి గంగుల 


కరీంనగర్‌ టౌన్‌, నవంబరు 20: రాష్ట్రంలో డిసెంబరు 10న నిర్వహించ నున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం టీఆర్‌ఎస్‌ సిద్ధమవుతోంది. అందులో భాగంగా ఉమ్మడి జిల్లా పరిధిలోని ఎన్నికల సన్నాహక సమావేశాన్ని కరీంనగర్‌ లో మంత్రి గంగుల కమలాకర్‌ నిర్వహించారు. కరీంనగర్‌ నగరపాలక, కొత్తపల్లి మున్సిపాలిటీలకు చెందిన డిప్యూటీ మేయర్‌, చైర్మన్‌, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. మంత్రి గంగుల కమలాకర్‌ పార్టీ శ్రేణులకు దిశా నిర్ధేశం చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికను పార్టీ అధిష్టానానికి అప్పగిస్తూ ముఖ్య మంత్రి కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ నిర్ణయించే అఽభ్యర్థికి పార్టీలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఏక నిర్ణయంతో మద్దతు తెలుపాల్సిందిగా సూచించారు. సమా వేశంలో పాల్గొన్న పాలకవర్గాల సభ్యులు ఈ ప్రతిపాదనకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అభ్యర్థి ఎంపిక నిర్ణయాన్ని పార్టీ అధిష్ఠానానికి అప్పగిస్తూ పార్టీ నిర్ణయమే శిరోధార్యమని, పార్టీ నిర్ణయించిన అభ్యర్థికి సంపూర్ణ మద్దతు తెలుపు తామని  తీర్మానించారు. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్‌, సిరిసిల్ల నియోజక వర్గాల కు మంత్రి గంగుల కమలాకర్‌, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలకు మంత్రి కొప్పుల ఈశ్వర్‌ బాధ్యులుగా ఉన్నారు. సమావేశంలో కరీంనగర్‌ డిప్యూటీ మేయర్‌ చల్లస్వరూపరాణిహరిశంకర్‌, కొత్తపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ రుద్ర రాజు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-21T05:46:17+05:30 IST