‘మేదరి బంధు’ ప్రకటించాలి
ABN , First Publish Date - 2021-08-13T17:37:29+05:30 IST
రాష్ట్రంలో దళితులకు..
సుభాష్‌నగర్: రాష్ట్రంలో దళితులకు దళితబంధు ప్రకటించినట్లగానే రాష్ట్ర ప్రభుత్వం మేదరి బంధు పథకాన్ని ప్రకటించాలని కరీంనగర్ జిల్లా మేదరి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఏకుల రాజనర్సు కోరారు. గురువారం నగరంలోని ప్రెస్‌భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో మేదరుల జనాభా సుమారు లక్షా 50 వేల ఉంటుందని, 90 వేల మంది మేదరి కులవృత్తి మీద ఆధా రపడి జీవిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 240 వెదరు పారిశ్రామిక సహకార సంఘాలు వెదురు సస్లయి లేకపోవడంతో మూతపడ్డాయని, పారిశ్రామి సభ్యుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. వెంటనే మేదరి బంధు ప్రకటించి ఆదుకో వాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శి అలిపిరెడ్డి లచ్చ య్య, కరీంనగర్ పట్టణ అధ్యక్షుడు విద్యమారి తిరుపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏకుల రమేశ్, పట్టణ కోశాధికారి బొట్లం రామస్వామి, వెంకటనర్సయ్య, బొల్లం నారాయణ, ఎనగందుల ఈశ్వరయ్య, సర్వేశం, సిలివేరి సత్యనారాయణ పాల్గొన్నారు.