పత్తి రైతులకు మద్దతు ధర వచ్చేలా చర్యలు

ABN , First Publish Date - 2021-10-08T05:25:26+05:30 IST

ఈ సీజన్‌లో జిల్లాలో సాగైన పత్తి పంటను మద్దతు ధరకు తక్కువ గాకుండా కొనుగోలు చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారా యణ అన్నారు.

పత్తి రైతులకు మద్దతు ధర వచ్చేలా చర్యలు
పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ

- సమీక్ష సమావేశంలో కలెక్టర్‌ డాక్టర్‌ సంగీతసత్యనారాయణ

పెద్దపల్లి, అక్టోబర్‌ 7 (ఆంధ్రజ్యోతి): ఈ సీజన్‌లో జిల్లాలో సాగైన పత్తి పంటను మద్దతు ధరకు తక్కువ గాకుండా కొనుగోలు చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారా యణ అన్నారు. గురువారం ఆమె సంబంధి త అధికారులతో కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. క్వింటా లు పత్తికి ప్రభుత్వం రూ.6,025 మద్దతు ధర ప్రకటించిందన్నారు. మార్కెట్‌ యార్డు లు, కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మద్దతు ధర దక్కేలా చర్యలు తీసుకోవాలన్నారు. సీసీఐ కేంద్రాలకు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా రైతులు పత్తిని తీసుక వచ్చే విధంగా అవగాహన కల్పించాలన్నారు. ప్ర స్తుతం ప్రైవేట్‌లో పత్తికి మంచి డిమాండ్‌ ఉందన్నారు. పత్తిని విక్రయించే సమయం లో 8నుంచి 12 శాతం మాత్రమే తేమ ఉం డేలా రైతులు చూసుకోవాలన్నారు. పత్తిని సంచుల్లో కాకుండా విడిగా తీసుకరావాల న్నారు. 8శాతం తేమ ఉంటే రూ.6,025, 12 శాతం తేమ ఉంటే రూ.5,784 ధర నిర్ణయం చారన్నారు. జిల్లాలో 63,255ఎకరాల్లో పత్తిని సాగు చేశారని, 6 లక్షల క్వింటాళ్ల వరకు దిగుబడి రావచ్చని అంచనా వేస్తున్నామన్నా రు. మార్కెట్‌లో మద్దతు ధర లభించని పక్షంలో సీసీఐ ద్వారా కొనుగోలు చేస్తామ న్నారు. రైతులకు మద్దతు ధర లభించేందు కు గాను ఉన్నత స్థాయి కమి టీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిన్నింగ్‌ మిల్లులు, ఇతర కొనుగోలు కేంద్రాల్లో కాంటాలను పరిశీలించి వాటి పనితీరుపై నివేదిక అందించాలని తూ నికలు, కొలతల శాఖాధికారిని ఆదేశించారు. సీసీఐకి పత్తి విక్రయించే సమయంలో పట్టా దారు పాసుపుస్తకం, ఆధార్‌కార్డు, పత్తి రైతు గుర్తింపు కార్డు, బ్యాంకు పాసుబుక్‌ జిరాక్స్‌ ప్రతులను తీసుకరావాలని కలెక్టర్‌ రైతులను కోరారు. అనంతరం పోస్టర్‌ను ఆవిష్కరించా రు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ లక్ష్మీనా రాయణ, డీఎంఓ ప్రవీణ్‌రెడ్డి, ఏసీపీ సారంగ పాణి, సీసీఐ అధికారి, మార్కెట్‌ కమిటీల కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-08T05:25:26+05:30 IST