‘మట్కా’ మాయ
ABN , First Publish Date - 2021-06-09T05:47:42+05:30 IST
జిల్లాలో చాపకింద నీరులా మ ట్కా జోరుగా నడుస్తోంది. మట్కా మహమ్మారి పేదల బతుకుల్ని చిద్రం చేస్తోంది.
- చితికిపోతున్న పేదల బతుకులు
- జిల్లాలో ప్రతి రోజు లక్షల్లో దందా
జగిత్యాల, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో చాపకింద నీరులా మ ట్కా జోరుగా నడుస్తోంది. మట్కా మహమ్మారి పేదల బతుకుల్ని చిద్రం చేస్తోంది. మట్కా రోజురోజుకు క్రమంగా ఎక్కువ వుతోంది. పెరిగి న సాంకేతికతను సైతం జూదరులు వినియోగించుకుంటున్నారు. ఇంటర్ నెట్‌లోనూ మట్కా ఆడుతున్నారు. ప్రధానంగా జిల్లాలోని జగిత్యాల, కో రుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్ పట్టణాలతో పాటు పలు మండల కేంద్రాలు, మేజర్ పంచాయతీల్లో సైతం మాట్కా నడుస్తోంది. ఇందుకు ప్రత్యేకమైన ఏజంట్లు సైతం ఉంటున్నారు. రోజంతా కష్టపడి సంపాదిం చిన కూలీ డబ్బులంతా మట్కా నంబర్ల ఆటలో పొగొట్టుకుంటున్న కు టుంబాలు వందల్లో ఉంటున్నాయి. మహారాష్ట్రలోని ముంబాయి, పుణే, చంద్రాపూర్, నాగాపూర్, హైద్రా బాద్ కేంద్రాలుగా సాగుతున్న ఇటీవల కాలంలో జగిత్యాల జిల్లాలో యేథేచ్చగా జరుగుతోంది. నిత్యం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు దందా సాగుతోంది. ఉదయం నుంచి సాయం త్రం 5 గంటల వరకు సాగే ఆటను తెలంగాణ, కల్యాణ్ అని, రాత్రి 12 గంటల వరకు సాగే ఆటను ముంబాయిగా పిలుస్తుంటారు. ఓపెన్, క్లో జింగ్, బ్రాకెట్, పానా పేర్లతో దందా నడుస్తోంది. గతంలో ఈ ఆట జి ల్లాలో తగ్గినట్లు అనిపిం చినా, కొన్ని మాసాలుగా మళ్లీ జోరందుకోంది.
మురికి వాడల్లోనే ఎక్కువగా....
జిల్లాలోని పలు పట్టణాలు, గ్రామాల్లో గల మురికి వాడల్లో మట్కా ఆట జోరుగా జరుగుతోంది. మురికి వాడల్లో కూలీ, నాలీ చేసుకునే చాలా మంది మట్కా జూదానికి అలవాటుపడుతున్నారు. ఎక్కువగా యువత మట్కా జూదం బారిన పడుతోంది. రోజంతా సంపాదించినదంతా సా యంత్రం మట్కా జూదంల పెట్టి పోగొట్టుకుంటున్నారు. పోలీసులు అడ పాదడపా దాడులు చేస్తుండడంతో ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగుతోంది.
మద్యవర్తులదే హవా....
మట్కా జూదంలో మద్యవర్తులదే హవా కొనసాగుతోంది. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు వీరు నంబర్లతో కుస్తీలు పడుతూ జూదరులకు సలహాలు, సూచనలు ఇస్తుంటారు. జిల్లాలో సుమారు పాతిక మంది వరకు మద్యవర్తులున్నట్లు అంచనా ఉంది. మద్యవర్తులు చెప్పింది నమ్మి జూదరులు ఆటలో డబ్బులు పోగొట్టుకొని లబోదిబోమంటున్నారు.
ప్రతి రోజు లక్షల్లో దందా...
జిల్లాలో ప్రతి రోజు లక్షల్లో దందా సాగుతోంది. ఒక్కో మద్యవర్తి రోజు కు రూ. 5 వేల నుంచి రూ. 10 వేల వరకు కమిషన్లను దండుకుంటు న్నారు. ఓపెన్, క్లోజింగ్, బ్రాకెట్, పానా పేరిట ఆట సాగుతోంది. మట్కా లో మొదటగా మూడు నంబర్లు ఆ రోజు వచ్చినట్లుగా విడుదల చేస్తా రు. ఆ నంబర్లను ఫోన్‌ల ద్వారా ఇక్కడి నిర్వాహకులు తెలుసుకొని ప్రకటిస్తారు. ఇలా మట్కా ఆటను అర్ధరాత్రి వరకు జిల్లాలో యథేచ్చగా ఆ డుతున్నారు. ఆటగాళ్లు క్లోజింగ్ నంబర్ వచ్చే వరకు వేచిచూస్తూ నంబ ర్ తెలుసుకునేందుకు పడిగాపులు కాస్తున్నారు.
ఫోన్లలోనే ఎక్కువగా....
జిల్లాలో మట్కా ఆడే వారంతా దాదాపుగా ఫోన్లనే వినియోగించు కుంటున్నారు. మద్య వర్తులు ఫోన్లలోనే నంబర్లు చెప్పి ఆడుతున్నారు. ముంబాయి, హైద్రాబాద్ వంటి నగరాల్లో గల బడా ఏంజట్లతో సంబం దాలు పెట్టుకొని మట్కాను కొనసాగిస్తున్నారు. ఇంటర్‌నెట్, ఫోన్‌ల ద్వా రా ఎప్పటికప్పుడు నంబర్లను సేకరిస్తూ తమ వ్యాపార కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రా యికల్ పట్టణాల్లో బయటకు పొక్కనీయకుండా జరుపుతున్న మట్కా వ్యాపారం వల్ల పలు చిన్నాచితక కుటుంబాలు రోడ్డు పాలు అవుతున్నా యి. అసలే రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలు ఈ మాట్కా మహమ్మారికి చిక్కి మరింత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మట్కా నియంత్రణకు అవసరమైన చర్య లు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.