కరీంనగర్‌కు మణిహారంగా కేబుల్ బ్రిడ్జి
ABN , First Publish Date - 2021-12-27T05:33:03+05:30 IST
మానేరు వాగుపై నిర్మి స్తున్న కేబుల్ బ్రిడ్జి కరీంనగర్‌కు మణిహారం కానుందని రాష్ట్ర పౌరసరఫర, బీసీ సంక్షేమ శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కోన్నారు.
మూడు నెలల్లో పూర్తిస్థాయిలో సిద్ధం
మంత్రి గంగుల కమలాకర్
సుభాష్‌నగర్, డిసెంబరు 26: మానేరు వాగుపై నిర్మి స్తున్న కేబుల్ బ్రిడ్జి కరీంనగర్‌కు మణిహారం కానుందని రాష్ట్ర పౌరసరఫర, బీసీ సంక్షేమ శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కోన్నారు. ఆదివారం ఆయన మీ సేవా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడారు. 183 కోట్ల రూపాయలతో కేబుల్ బ్రిడ్జి పూర్తైందన్నారు. కమాన్ నుంచి సదాశివపల్లి వర కు అప్రోచ్ రోడ్ భూసేకరణకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో 41 కోట్లు విడుదల చేసి ఈ నెల 21న జీవో కూడా ఇచ్చారని తెలిపారు. ప్రస్తుతం కేబుల్ బ్రిడ్జి వరకు రోడ్డు, సెంట్రల్ లైటింగ్ నిర్మాణ పనులు కొనసాగుతు న్నాయన్నారు. కేబుల్ బ్రిడ్జి వద్ద ఆరు కోట్లతో డైనమిక్ లైట్లు ఏర్పాటు చేస్తున్నామని, ఇది దేశంలోనే ప్రథమం అని చెప్పారు. రైతులకు సర్వీస్ రోడ్డు ఇతర సదుపాయాలకు ఏడు కోట్లు ఖర్చు చేస్తు న్నామని తెలిపారు. సబర్మతి రివర్ ఫ్రంట్ తర్వాత ఆ స్థాయిలో నిర్మించే మానేరు రివర్ ఫ్రంట్ పనులకు జనవరిలో టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు.
కేబుల్ బ్రిడ్జి పూర్తైతే మానేరు వాగుపై ఏర్పాటు చేయనున్న మానేరు రివర్ ఫ్రంట్ తెలంగాణలో బ్యూటి ఫుల్ రివర్ ఫ్రంట్‌గా ఉండనుందన్నారు. వరదల వల్ల చెక్‌డ్యాంలు పాడైపోయాయని, ఆ ప్రాంతంలో డిజైన్ మార్చి తిరిగి నిర్మిస్తామన్నారు. జిల్లా అభివృద్ధికి 350 కోట్లు కేటాయించామని, అందులో వంద కోట్ల పనులు ఇప్పటికే పూర్తయ్యాయన్నారు. 85 కోట్లతో కరీంనగర్ - సిరిసిల్ల రోడ్డు అద్భుతంగా తయారవుతుందన్నారు. ఎలగందల్ ఫోర్టును ఆనుకొనివెళ్లేలా కాకతీయ కాలువ పై 30 కోట్లతో రెండు బ్రిడ్జిల నిర్మాణం చేపట్టామని, దీనికి సైతం 21న జీవో వచ్చిందన్నారు. కరీంనగర్ నుంచి సిరిసిల్లకు వెళ్లే రోడ్డు అద్బుతంగా తయారవు తుంద న్నారు. ఎన్నికల కారణంగా జిల్లా సమీక్షలను నిర్వహించ లేకపోయామని, ఇక అభివృద్ధిపై దృష్టి సారించామన్నారు. పెండింగ్‌లో ఉన్న స్మార్ట్ సిటీ పను లు, ఆర్ అండ్ బీ పనులు, ఇతర పనులు పూర్తి చేస్తామన్నారు. రాజకీయాలు మాట్లాడే పరిస్థితి తీసుకురావడం లేదన్నారు. అందరం కలసి అభివృద్ధి చేసుకుందామన్నారు.
ధాన్యం కొనేదాక వదిలి పెట్టం...
రైతులు పండించిన పంటను ప్రభుత్వం కొనాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో రైతులకు హక్కు ను కల్పించారని అన్నారు. అయితే ఆ చట్టం అమలు చేసేది కేంద్ర ప్రభుత్వమని. రైతులు పండించిన పంటను కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐ ద్వారా కొనుగోలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద పారబోసి నిరసన వ్యక్తం చేస్తామని, రైతులు పండించిన ధాన్యం కొనేదాక వదిలి పెట్టమన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై చిన్న చూపు చూస్తుందన్నారు. యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రా లు ఉండవని, రైతులే నేరుగా రైస్ మిల్లర్లకు, సహకార సంఘాలకు, విత్తనాల కంపెనీలకు విక్రయించుకోవాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో మేయర్ వై సునీల్‌రావు, చల్ల హరిశంకర్, జమీలొద్దీన్, వాసాల రమేశ్, రూరల్ ఎంపీపీ తిపర్తి లక్ష్మణ్, బల్మూరి ఆనందరావు, ఎడ్ల అశోక్, మొగిలోజు వెంకట్ పాల్గొన్నారు.