మధ్యాహ్న భోజన నిర్వాహకుల ధర్నా

ABN , First Publish Date - 2021-03-21T05:52:47+05:30 IST

జిల్లాలోని మధ్యాహ్న భోజన నిర్వాహకులంతా జిల్లా విద్యాధికారి కార్యాలయం ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు.

మధ్యాహ్న భోజన నిర్వాహకుల ధర్నా
ధర్నా చేస్తున్న మధ్యాహ్న భోజన నిర్వాహకులు

పెద్దపల్లి కల్చరల్‌, మార్చి 20 : జిల్లాలోని మధ్యాహ్న భోజన నిర్వాహకులంతా జిల్లా విద్యాధికారి కార్యాలయం ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్‌ ప్రతినిఽధులు సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తాండ్ర సదానందం మాట్లాడుతూ వారానికి మూడు గుడ్లు ఒక్కో విద్యార్థికి పెట్టమని విద్యాశాఖ ఆదేశిస్తూ ఉండగా ఒక్కో కోడి గుడ్డు ధర 5 రూపాయల నుంచి 6 రూపాయల వరకు పెరిగిందన్నారు. పెరిగిన ధరలను ఇవ్వకుండా అదే పద్ధతిలో నడపడం వల్ల తాము ఆర్థికంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఈ విషయమై 30 జులై 2019న వినతిపత్రం ఇచ్చినా ఎలాంటి స్పందన లేదని, అందుకే ఈనెల 20న జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్న భోజనాన్ని నిలిపివేశామని తెలిపారు. అంగన్‌వాడీ సెంటర్‌లకు సప్లై చేసిన విధంగానే తమకు కూడా చేయాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్ర మంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్‌, సహాయ కార్యదర్శి, ఉపాధ్యక్షులు గుండు రమాదేవి, మేకల యశోధ, సులోచన, రావిచెట్టు సంతోష్‌, రాజేశ్వరి, మల్లేశ్వరి, కూర పద్మ తదిత రులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-21T05:52:47+05:30 IST