ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో స్థానిక యువకులకు ఉపాధి కల్పించాలి

ABN , First Publish Date - 2021-10-07T06:24:05+05:30 IST

ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో స్థానిక యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో హెచ్‌ఆర్‌ అధికారులకు వినతి పత్రం సమర్పించారు.

ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో స్థానిక యువకులకు ఉపాధి కల్పించాలి
అధికారులకు వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

- జేఏసీ ఆధ్వర్యంలో హెచ్‌ఆర్‌ అధికారులకు వినతి

కోల్‌సిటీ, అక్టోబరు 6: ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో స్థానిక యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో హెచ్‌ఆర్‌ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. గత రెండు సంవత్సరాలు గా ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో కాంట్రాక్టు కార్మికులకు, డిపెండెంట్లకు, భూ నిర్వాసితులకు, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు ఇవ్వాలని చాలాసార్లు వినతిపత్రం ఇచ్చామ ని తెలిపారు. కాలుష్య సమస్య ఎదుర్కొంటున్న వీర్లపల్లి గ్రామానికి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న ఉద్యోగాలపై గత నెల 29న కేంద్ర ఎరువుల శాఖ మంత్రికి, పెద్దపల్లి ఎంపీకి వినతిపత్రం ఇచ్చామని చెప్పారు. స్థానికులకు ఉపాధి కల్పించాలని వారు డిమాండ్‌ చేశారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో జేఏసీ కన్వీనర్‌ వెల్తూరు మల్లయ్య, కో కన్వీనర్‌ నారాయణ, విశ్వనాథ్‌, ఎంఏ గౌస్‌, రాజనందం, రత్నకుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-07T06:24:05+05:30 IST