నేటి నుంచి ప్రత్యక్ష తరగతులు

ABN , First Publish Date - 2021-02-01T06:09:59+05:30 IST

కొవిడ్‌తో పది నెలలుగా మూతపడ్డ పాఠశా లల్లో సోమవారం నుంచి రాజ న్న సిరిసిల్ల జిల్లాలో ప్రత్యక్ష బోధనకు సర్వం సిద్ధం చేశారు.

నేటి నుంచి ప్రత్యక్ష తరగతులు
సిరిసిల్లలో పాఠశాలను శుభ్రం చేస్తున్న కార్మికులు

- 9 నుంచి ఆపై చదువుతున్న విద్యార్థులకు.. 

- తల్లిదండ్రుల నుంచి నో అబ్జెక్షన్‌ సర్టిఫికేట్‌ ఇస్తేనే అనుమతి


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

కొవిడ్‌తో పది నెలలుగా మూతపడ్డ పాఠశా లల్లో సోమవారం నుంచి రాజ న్న సిరిసిల్ల జిల్లాలో ప్రత్యక్ష బోధనకు సర్వం సిద్ధం చేశారు. అన్‌లైన్‌ పద్ధతి ద్వారా బోధన కొనసాగిన ప్రస్తుతం పాఠశాలలో 9, 10 తరగతుల విద్యార్థు లకు, ఇంటర్‌ కళాశాల విద్యార్థులకు ప్ర త్యక్ష బోధనకు సిద్ధం చేశారు. ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలో కొవిడ్‌ నిబంధనలకు అ నుగుణంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. పాఠశాలను గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ ల సహకారంతో పారిశుధ్య కార్మికులతో శుభ్రప రిచారు. పాఠశాలను శానిటైజేషన్‌ చేశారు. కలె క్టర్‌ కృష్ణభాస్కర్‌, డీఈవో రాధాకిషన్‌ పాఠశాల లను సిద్ధం చేసిన తీరును పరిశీలించారు. పలు సూచనలు చేశారు. కొవిడ్‌పై అవగాహన కల్పిం చడమే కాకుండా విద్యార్థుల మధ్య భౌతిక దూ రం ఉండే విధంగా బెంచీకి ఒక్కరు చొప్పున గదికి 20 మందినే కేటాయించనున్నారు. విద్యా ర్థులకు థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేయనున్నారు. దగ్గు, జలుబు వంటి సమస్యలు ఉంటే ఇంటికి పం పించనున్నారు. అత్యవసరం అనుకుంటే అందు బాటులో ఉన్న అసుపత్రిలో పరీక్షలు చేయించ నున్నారు. కళాశాలల్లో మొదటి సంవత్సరం, రెం డో సంవత్సరం విద్యార్థులు రోజు విడిచి రోజు విద్యాబోధన కొనసాగించనున్నారు. తల్లిదండ్రు ల నుంచి నో అబ్జెక్షన్‌ డిక్లరేషన్‌ను తప్పనిసరి గా తీసుకోనున్నారు. తల్లిదండ్రుల ఒప్పందం మేరకే పాఠశాలకు అనుమతించ నున్నారు. జిల్లాలో 192 పాఠశాలల్లో 9, 10 తరగతుల వి ద్యార్థులు 12వేల 499 మంది విద్యార్థులు, 10 క ళాశాలల్లో 3,006 మంది విద్యార్థులు కలిపి 15,505 విద్యార్థులు తరగతులకు రానున్నారు.

ఫ పాడైన బియ్యం..

పాఠశాలల్లో మధ్యాహ్నా భోజన నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. దాదాపు పది నెల లుగా మధ్యాహ్నా భోజనం నిలిచిపోవడంలో బియ్యం పాడయ్యాయి. వాటిని శుభ్రపరిచిన బాగా లేకపోవడంతో వాటిని మార్చుకోవడానికి ఉపాధ్యాయులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మధ్యాహ్నా భోజనం పరిశీలనకు ప్రత్యేకంగా ఉపాధ్యాయులను కూడా నియమించారు.

Updated Date - 2021-02-01T06:09:59+05:30 IST