ధర్మపురిలో కోజాగరి పౌర్ణమి వేడుకలు
ABN , First Publish Date - 2021-10-20T05:51:39+05:30 IST
ధర్మపురి క్షేత్రంలో కోజాగరి పౌర్ణమి వేడుకలు మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు.

ధర్మపురి, అక్టోబరు 19: ధర్మపురి క్షేత్రంలో కోజాగరి పౌర్ణమి వేడుకలు మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. స్థానిక శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి దేవాలయం ప్రాంగణంలో రాత్రి పాలలో చంద్రుడిని వీక్షించారు. రాత్రి ఆలయ వేద పండితులు బొజ్జ రమేష్శర్మ, సామవేద పండితులు ముత్యాలశర్మ తదితర వేద బ్రాహ్మణుల మంత్చోచ్ఛరణల మధ్య స్వామి వారల చిత్రపటానికి విశేష పూజలు జరిపారు. భక్తులు అర్ధరాత్రి పాలలో చంద్రుడిని దర్శనం చేసుకుని పుణ్య ఫలం పొందారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ ద్యావళ్ల కిరణ్కుమార్, సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్, యజ్ఞాచార్యులు కందాలై పురుషోత్తమాచార్యులు, ఉప ప్రధాన అర్చకులు నేరెళ్ల శ్రీనివాసాచార్యులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు సంగన భట్ల దినేష్, మాజీ ధర్మకర్తలు రవీందర్, వేంకటేశ్వర్రావు, సిబ్బం ది పాల్గొన్నారు.