4,766 మందికి కొవిడ్‌ టీకా

ABN , First Publish Date - 2021-07-24T05:39:58+05:30 IST

జిల్లాలోని 27 ప్రభుత్వ కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో 4,766 మంది టీకా తీసుకున్నారని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ జువేరియా ఒక ప్రకటనలో తెలిపారు.

4,766 మందికి కొవిడ్‌ టీకా

 సుభాష్‌నగర్‌, జూలై 23: జిల్లాలోని 27 ప్రభుత్వ కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో 4,766 మంది టీకా తీసుకున్నారని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ జువేరియా ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని ప్రభుత్వ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కోవిషీల్డ్‌ టీకా రెండవ డోస్‌లు మాత్రమే ఇవ్వనున్నట్లు తెలిపారు. కోవాక్సిన్‌ రెండవ డోస్‌ టీకాలు విద్యానగర్‌ అర్బన్‌ ఆరోగ్య కేంద్రం పరిధిలోని విద్యానగర్‌ ఆర్‌టీసీ డిస్పెన్షనరీలో ఇస్తారని తెలిపారు. కరీంనగర్‌ యూపీ హెచ్‌సీ మోతాజ్‌ఖాన్‌ పరిధిలోని ఎస్‌ఆర్‌ డీజీ స్కూల్‌లో, కట్టరాంపూర్‌ యూపీహెచ్‌సీ పరిధిలోని బీఆర్‌ అంబేద్కర్‌ స్టేడియంలో, హౌసింగ్‌ బోర్డు పరిధిలోని కుమ్మరివాడ స్కూల్‌లో, యూపీహెచ్‌సీ సప్తగిరికాలనీ పరిధిలోని సప్తగిరి హైస్కూల్‌లో, జిల్లా ప్రధాన వైద్యశాలలోని వెల్‌నెస్‌సెంటర్‌లో ఇవ్వనున్నట్లు తెలిపారు. హుజూరాబాద్‌, జమ్మికుంట ఏరియా ఆసుపత్రుల్లో కోవిషీల్డ్‌ రెండవ డోస్‌ టీకాలు ఇస్తారని తెలిపారు. జమ్మికుంట ఆరోగ్య ఉప కేంద్రంలో, హుజూరాబాద్‌ బాలికల హైస్కూల్‌లో కోవాక్సిన్‌ రెండవ డోస్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. బుట్టిరాజారం కాలనీ యూపీహెచ్‌సీలో విదేశాలకు వెళ్లే విద్యార్థులు, వర్క్‌ పర్మిట్‌ గల ఉద్యోగులకు కోవీషీల్డ్‌ ఇస్తారని తెలిపారు. ఇతర వివరాలకు ఫోన్‌ : 9849902501 నెంబర్‌లో సంప్రదించాలని సూచించారు. 


100 మందికి కరోనా పాజిటివ్‌

 

జిల్లాలో శుక్రవారం 7,147 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 100 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో 1,749 మందికి పరీక్షలు నిర్వహించగా 24మందికి, మండలాల్లో 5,398 మందికి పరీక్షలు నిర్వహించగా 76 మందికి కరోనా నిర్ధారణ అయింది. 


Updated Date - 2021-07-24T05:39:58+05:30 IST