కొవిడ్‌ నిబంధనలు పాటించాలి

ABN , First Publish Date - 2021-05-14T04:31:07+05:30 IST

ప్రభుత్వం విధించిన కొవిడ్‌ నిబందనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్‌పీ సింధుశర్మ హెచ్చరించారు.

కొవిడ్‌ నిబంధనలు పాటించాలి
ఈ- చాలాన్‌ యాప్‌ను పరిశీలిస్తున్న ఎస్‌పీ సింధుశర్మ

ఎస్‌పీ సింధుశర్మ

కోరుట్ల, మే 13: ప్రభుత్వం విధించిన కొవిడ్‌ నిబందనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని  ఎస్‌పీ సింధుశర్మ హెచ్చరించారు. గురువారం పట్టణంలోని వివిధ ప్రాంతాలలో సీఐ రాజశేఖర్‌ రాజుతో కలసి లాక్‌డౌన్‌ పరిస్థితులను సమీక్షించారు. పట్టణంలోని కోత్త బస్టాండ్‌, ఐబీ రోడు, నంది చౌరాస్తా ప్రాంతాలలో పోలీసులు నిర్వహిస్తున్న పికెటింగ్‌ను పరిశీలించారు. ఈ సంద ర్భంగా లాక్‌డౌన్‌లో వాహనాలకు విధించే ఈ చాలాన్‌ జరిమానా విధానాన్ని అడిగి తెలుసుకొని యాప్‌ను పరిశీలించారు.  కార్యక్రమం లో ఎస్సైలు సతీష్‌, రాజప్రమీల, పృధ్వీధర్‌, సుదీర్‌రావు పాల్గొన్నారు. 

మెట్‌పల్లి: కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను జిల్లాలో కఠినంగా అమలు చేస్తామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠి న చర్యలు తీసుకుంటామని ఎస్పీ సింధుశర్మ హెచ్చరించారు. గురువారం పట్టణంలో లాక్‌డౌన్‌ పరిస్థితులను అమె పరిశీలించారు. ఈ సందర్భంగా అమె మాట్లడుతూ లాక్‌డౌన్‌ ప్రశాం తంగా కొనసాగించడానికి పూర్తి స్థాయిలో బందో బస్తు ఎర్పాటు చేసినట్లు తెలిపారు. పట్టణంలోని పరిస్థితులను సమీక్షించారు. సీఐ శ్రీనివాస్‌కు, ఎస్సై సధాకర్‌కు పలు సూచనలు చేశారు. 


Updated Date - 2021-05-14T04:31:07+05:30 IST